సిరి మూవీస్ బ్యానర్‌పై రమణ్ కథానాయకుడిగా కె.శిరీషా రమణా రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ . ఈ సినిమాను ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఎం.రమేష్, గోపి దర్శకత్వం వహించారు. ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష హీరోయిన్స్. సీనియర్ నటుడు వినోద్ కుమార్ విలన్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్,సాంగ్స్‌కు మంచి ఆదరణ లభించాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 8 న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర హీరో రమణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ..
మాది రాయలసీమ కడప జిల్లా వీరబ్రహ్మేంద్ర మఠం దగ్గర ఎద్దులాయ పల్లె అనే మారుమూల గ్రామం.మాది వ్యవసాయ కుటుంబం. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసి పెరిగాను. ఆయన సినిమాలకు ఇంప్రెస్ అయి నేనుకూడా సినిమాలు చేయాలి అని కలలు కనే వాన్ని. సినిమా మీద ఉన్న ప్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చిన నేను చాలాచోట్ల అవకాశాల కోసం తిరిగాను. కానీ ఆర్టిస్ట్ గా చెయ్యమని ఆఫర్ వచ్చాయి కానీ చేయలేదు.
సిరి మూవీస్ బ్యానర్‌ను స్థాపించి అందులో తొలి ప్రయత్నంగా ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ సినిమా చేశాం. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. అందరికీ సినిమా నచ్చుతుందనే నమ్మకముంది. మా సోదర సమానులైన దర్శకులు రమేష్, గోపి సినిమాను చక్కగా, ప్రతి ఒక్కరికీ నచ్చేలా రూపొందించిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను.రెడ్డిగారింట్లో రౌడీయిజం టైటిల్ చాలా బాగుంది. ఇందులో సీనియర్ నటుడు వినోద్ కుమార్ గారు విలన్ గా నటిస్తున్నాడు.ఇందులో వాణి విశ్వనాథ్ చెల్లెలు కూతురు వర్ష విశ్వనాథ్, ప్రియాంక రౌరీ, పావని, లావణ్య శర్మ నలుగురు హీరోయిన్స్ వున్నారు. ఈ సబ్జెక్టు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కామెడీ, యాక్షన్ ,లవ్ స్టోరీ లతో పాటు ఒక మంచి మెసేజ్ ఉంటుంది
ఈ సినిమా చూసిన తరువాత ఈ సబ్జెక్ట్ నా లైఫ్ లో జరిగింది అనుకునే విధంగా ఈ కథ ఉంటుంది. ఇందులో కామెడీ వెంకట్, సిద్ధూ, మిర్చి మాధవి ఇలా చాలామంది చేశారు. ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు
ఈ సినిమాను ఏపీ, తెలంగాణ కర్ణాటక, తమిళనాడు, గోవా మహారాష్ట్ర ఐదు రాష్ట్రాలలో షూట్ చేశాము.అయితే ఎక్కువ భాగం రాయలసీమ ప్రాంతంలోని కుప్పం ఏరియాలో షూట్ చేశాము. ఇందులో ఐదు ఫైట్స్,ఐదు పాటలు ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నారాయణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. కెమెరామెన్ నారాయణ, బ్యాక్గ్రౌండ్ శ్రీవసంత్ అందరూ మా సినిమాకు చాలా బాగా చెయ్యడమే కాక మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. దర్శకులు రమేష్ గోపి లు వన్ ఇయర్ గా నాతో ట్రావెల్ అవుతూ సబ్జెక్ట్ మీద చాలా కసరత్తు చేశారు. సినిమాస్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు.
“రెడ్డి గారింట్లో రౌడీయిజం” అనగానే ఇది పూర్తి యాక్షన్
ఫిలిం అనుకోవద్దు. ఒక వ్యక్తిని మార్చాలనుకున్నప్పుడు, చెప్పాలనుకున్నప్పుడు కొట్టి మార్చాల్సిన అవసరం లేదు, మాటలతో చెప్పి మార్చవచ్చు.అనే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. మాధవ సేవే మానవ సేవ అనే దానికి నిర్వచనం ఈ సినిమా చూస్తే తెలుస్తుంది .
టెక్నిషియన్స్ అందరూ కూడా ఒక కొత్త హీరో అని చూడకుండా సీనియర్ హీరోని ఎల్సా ట్రీట్ చేస్తారో నన్ను అలాగే చూసుకున్నారు.వినోద్ కుమార్ గారు నన్ను ప్రోత్సహిస్తూ నటనలో కొన్ని మెలకువలు నేర్పుతూ నాకు దైర్యాన్నిచ్చారు
ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఇది పక్కింటి కుర్రాడు కథలా ఉంటుంది. ఇందులో కామెడీ, యాక్షన్, లవ్ ఇలా ఒక ప్రేక్షకుడు ఎం కావాలని ఎక్స్పెక్ట్ చేసి సినిమాకు వస్తారో వారికి కావాల్సిన అన్ని ఇందులో ఉన్నాయి సినిమా అయిపోయి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకుడు ఆనందంగా నవ్వుతూ ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూశామని బయటకు వస్తారు. ఏప్రిల్ 8న వస్తున్న మా “రెడ్డి గారింట్లో రౌడీయిజం” సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.
నటీనటులు:
రమణ్, ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష, వినోద్ కుమార్, రచ్చ రవి, మిర్చి మాధవి, జూనియర్ బాలకృష్ణ, శంకర్, కృష్ణ, ప్రకాష్ అడ్డా, వెంకట్, సిద్ధు తది తరులు
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: ఎం. రమేష్, గోపి
నిర్మాత: కె. శిరీషా రమణారెడ్డి
బ్యానర్: సిరి మూవీస్
సమర్పణ: కొరివి పిచ్చిరెడ్డి, సరస్వతి
రిలీజ్: స్క్రీన్ మ్యాక్స్ పిక్చర్స్
సంగీతం: మహిత్ నారాయణ్
బ్యాగ్రౌండ్ స్కోర్: శ్రీవసంత్
సినిమాటోగ్రఫీ: ఎ.కె. ఆనంద్
ఎడిటింగ్: శ్రీనివాస్ పి. బాబు, సంజీవరెడ్డి
ఆర్ట్: నరేష్ సిహెచ్.
ఫైట్స్: అల్టిమేట్ శివ, కుంగ్‌ఫూ చంద్రు
కొరియోగ్రఫీ: చందు రామ్, రాజ్ పైడి, సాయిశివాజీ
—
RK.Chowdary PRO 9848623335