HomeTelugu*రావణలంక హీరో & నిర్మాత "క్రిష్" ఇంటర్వ్యూ*

*రావణలంక హీరో & నిర్మాత “క్రిష్” ఇంటర్వ్యూ*

కే సిరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై క్రిష్, అశ్విత, త్రిష జంట‌గా బి.ఎన్.ఎస్ రాజు ద‌ర్శ‌కత్వంలో క్రిష్ బండిప‌ల్లి నిర్మిస్తున్న యాక్ష‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ రావ‌ణలంక‌. ఈ సినిమాలో ముర‌ళి శ‌ర్మ‌, దేవ్ గిల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తికి చేసుకొని విడుదలకు సిద్ధమైన సందర్భంగా హీరో గా నటిస్తూ నిర్ముస్తున్న క్రిష్ పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..

నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాన్ని, నాకు సినిమా అంటే ప్రాణం.నాకు సినిమా సినిమా పై ఉన్న ఇంట్రెస్ట్ తో “మార్పు” అనే సీరియల్స్ లో హీరోగా చేయడం జరిగింది.ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించడం జరిగింది. ఆ అనుభవం తో నేను మంచి కంటెంట్ ను ఉన్న సబ్జెక్టు ను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమా చేయడం జరిగింది.

ఈ సినిమాలో మాకు మురళి శర్మ, దేవ్ గిల్, రచ్చరవి లాంటి మంచి క్యాస్టింగ్ మాకు దొరికింది. ఫ్యాన్ ఇండియా అర్టిస్టులు దొరకడం మా అదృష్టం .అందుకే నేను ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లడం జరిగింది నా మూవీకి ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్, ఒక క్రైమ్ థ్రిల్లర్ తో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. హీరోయిన్ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేసింది . డిఓపి గారు చాలా ఫుల్ సపోర్ట్ చేశారు.

చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరి ఇన్స్పిరేషన్ తో వారు పడిన కష్టం లో మేము 10% అయినా కష్టడాలని మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్టు ను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. ఈ టైటిల్ నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ టైటిల్ బాగుందని అప్రసియేట్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను

ఈ సినిమా ద్వారా నాకు చాలా మంది పెద్దలు పరిచయం అవ్వడం జరిగింది. మంచు విష్ణు గారు ఎంత బిజీగా ఉన్నా కూడా మేము అడిగిన వెంటనే ట్రైలర్ రిలీజ్ చేయడం, మంత్రి హరీష్ రావు గారు కరోనా టైం లో డోర్ కూడా తెరవని పరిస్థితుల్లో నన్ను ఇంటికి పిలిపించుకొని టీజర్ రిలీజ్ చేయడం, హరీష్ శంకర్ గారు సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. వీరందరూ పరిచయం నిజంగానే నేను చేసుకున్న అదృష్టం.అలాగే మా ప్రి రిలీజ్ కూడా ఎంతోమంది సినీ అతిరథ,మహారధులు అందరూ వచ్చి మిమ్మల్ని మా సినిమాను ఆశీర్వదించారు వారందరికీ మా కృతజ్ఞతలు.

ఈ నెల 19 న వస్తున్న మా సినిమా మధ్య ఏ పెద్ద సినిమాలు లేకపోవడం మా అదృష్టం. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు మా చిన్న సినిమా పెద్ద సినిమాలు రాకుండా చేశారని అనుకుంటున్నాను మా సినిమాకు ఇలా కలసి వచ్చినందుకు సినీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు. అలాగే బుక్ మై షో లో కూడా మా సినిమాకు మంచి రేటింగ్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో కంటెంట్ వర్కు గురించి చాలా మంది అడుగుతున్నారు.ఈ నెల 19 న వస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాము .

ఈ సినిమా ప్రేమ అంత ప్రాణం పెట్టి , బడ్జెట్ విషయం లో ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా నిర్మించాము.ఓటిటి లో ఆఫర్ వచ్చినా కూడా థియేటర్ లో రిలీజ్ చేయాలని థియేటర్లలో విడుదల చేస్తున్నాం.ఈ నెల 19 న వస్తున్న మా “రావణ లంక” సినిమానే థియేటర్లో మాట్లాడుతుంది

మ్యూజిక్ డైరెక్టర్ ఉజ్వల్ అద్భుతమైన సంగీతం అందించారు.. మా “రావణలంక” సినిమా సాంగ్స్ యూ ట్యూబ్ లో చాలా ట్రెండ్ అయ్యాయి.సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ వీరిద్దరూ కలిసి RRR సినిమాకు పాడిన వారు మా సినిమాకు కూడా పడినందుకు చాలా హ్యాపీగా ఉంది.ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది.

ఇందులో లవ్ & క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ తో పాటు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్నా కూడా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సబ్జెక్టు ప్రకారమే కథ నడుస్తోంది తప్ప ఎక్కడా కావాలనే ఫోర్స్డ్ సీన్స్ మాత్రం ఇందులో ఉండవు

నేను చేస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండాలని బ్యాంకాక్, మలేషియా ,జమ్ము కాశ్మీర్, సిమ్లా, మనాలి, గోవా, వైజాగ్,హైదరాబాద్ తదితర భారీ లొకేషన్లలో షూటింగ్ చేయడం జరిగింది. రచ్చ రవి ఫైట్ కోసం డాగ్ హౌస్, అల్యూమినియం ఫ్యాక్టరీ లలోభారీగా సెట్ వేయడం జరిగింది. సబ్జెక్టు డిమాండ్ చేసింది కాబట్టి చాలా భారీ బడ్జెట్ తో సినిమా చేయడం జరిగింది. ఒక్క షాట్ కోసమే బ్యాంకాక్ కి వెళ్ళాము. అది సినిమాకి కావాలి అనే నేను అక్కడికి వెళ్లి చేయడం జరిగింది.

ఎవరైనా మంచి కథలతో వస్తే మా బ్యానర్ లో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాను.అలాగే నాకీ మంచి కథలు వస్తే నేను యాక్టింగ్ కూడా చేస్తాను అని ముగించారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES