జీవిత‌కాలం సినిమాలు తీస్తూనే ఉంటా- క్రిష్‌

1382

రియ‌ల్ ఎస్టేట్ రంగంలో ఎంతోమందికి ఉపాధి క‌ల్పించి వ్యాపార‌వేత్త‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సాధించి ఇప్పుడు సినీ రంగంలోకి రావ‌ణ‌లంక చిత్రంతో హీరోగా నిర్మాత‌గా అడుగు పెడుతున్నారు. ఈ చిత్రాన్ని బిఎన్ఎస్‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కె.సిరీస్ అని సొంత బ్యాన‌ర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. 16.10.20 ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫిల్మ్‌ఛాంబ‌ర్‌లో విలేక‌రుల స‌మావేశంలో ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని రామ‌కృష్ణ‌గౌడ్ మాట్లాడుతూ… ముందుగా ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా క్రిష్‌గారికి శుభాకాంక్ష‌లు అన్నారు. ఇలాంటి మంచి చిత్రాల్ని అంద‌రూ త‌ప్ప‌కుండా ఎంక‌రేజ్ చేయాలి. ఒక‌ప్పుడు తెలంగాణలో గొప్ప హీరోగా పేరు తెచ్చుకుని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్ర‌హీత ఆయ‌న్ని ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుని సినిమాలు చేయాలి అన్నారు. సినిమా పై ఎంతో ఆశ‌క్తితో ఆయ‌న స్వ‌యంగా సినిమాని నిర్మించాల‌ని ముందుకు రావ‌డం చాలా గ్రేట్ అన్నారు. సినిమా థియేట‌ర్లు ఓపెన్ అవుతున్నాయి. ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమా చూసి అంద‌రూ ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా అన్నారు. కొత్త హీరోల‌ను ఎంక‌రేజ్ చేయ‌డం వ‌ల్ల ఇండ‌స్ట్రీకి మరింత మంది కొత్త హీరోలు వ‌స్తారు అన్నారు.

ప్ర‌స‌న్న‌కుమార్ మాట్లాడుతూ… ఈ రోజు ర‌ఘుప‌తివెంక‌య్య‌నాయుడు పుట్టిన‌రోజు ఆయ‌న్ని గుర్తుచేసుకుందాం. క‌రీంన‌గ‌ర్ పైడిరాజుగారి ఇన్‌స్పిరేష‌న్‌తో ఈయ‌న సినిమాల్లోకి వ‌చ్చారు. టైటిల్ రావ‌ణ‌లంక కూడా చాలా బాగా పెట్టారు. అప్ప‌ట్లో ఎన్టీఆర్‌గాఉ సీతారామ క‌ళ్యాణం చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించి కూడా ఆయ‌న ద‌ర్శ‌కుడిగా ఎక్క‌డా టైటిల్ వేసుకోలేదు. ఆ త‌ర్వాత మ‌రో రెండు చిత్రాల‌కు ద‌ర్శ‌కత్వం వ‌హించి అవి బాగా స‌క్సెస్ అయ్యాక మూడో చిత్రానికి ఆయ‌న పేరు వేసుకున్నారు అన్నారు. రియ‌ల్ ఎస్టేట్‌లో ఎలాగైతే స‌క్సెస్ అయ్యారో సినిమాల్లో కూడా అలాగే స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నా అన్నారు.

ద‌ర్శ‌కుడు స‌ముద్ర మాట్లాడుతూ… ముందుగా క్రిష్‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు. ఎంతో మంచి కృషితో పైకి రావాల‌ని కోరుకుంటున్నా అన్నారు. అన్ని థియేట‌ర్లు ఓపెన్ అవ్వాల‌ని అంద‌రి ఆరోగ్యం బావుండాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కు డు బిఎన్ఎస్‌రాజు మాట్లాడుతూ… ఈ చిత్రం మొత్తం రామాణాన్ని బేస్ చేసుకుని చేసిన చిత్రం. ఇందులోని ప్ర‌తి పాత్ర చాలా అద్భుతంగా వ‌చ్చింది. అలాగే ఇటీవ‌లె విడుద‌లైన ఈ చిత్రంలోని రెండు పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆదిత్యా మ్యూజిక్ వారు వీటిని ట్రెండింగ్‌లో పెట్టారు. మా హీరో క్రిష్‌గారికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఆయ‌న ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌ర్వాత ఇదే మొద‌టి పుట్టిన‌రోజు మా టీమ్ అంద‌రి త‌ర‌పున కూడా మ‌రోసారి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఇలాంటి పుట్టిన‌రోజులు మ‌రిన్నిజ‌రుపుకోవాలి అన్నారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా అన్నారు.

హీరో క్రిష్ మాట్లాడుతూ… ఈ చిత్రం నుంచి విడుద‌లైన రెండు పాట‌ల‌ను ప్రేక్ష‌కులు బాగా ఆద‌రించారు. అందుకు ముందుగా నా ప్రేక్ష‌క‌దేవుళ్ళ‌కు నా పాదాభివంద‌నం. నేను ఈ చిత్రాన్ని ఇంత బాగా తియ్య‌డానికి ముందుగా నా టీమ్ చాలా స‌హ‌క‌రించింది. వాళ్ళ స‌హ‌కారంతోనే ఇంత ముందుకు వెళ్ళ‌గ‌లిగాను. అలాగే నా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మా టీమ్ అంద‌రూ నా కోసం త‌యారు చేసిన ఆడియో చాలా బావుంది. అంద‌రికి నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. ఈ స్క్రిప్ట్ మీద నేను సంవ‌త్స‌రం పాటు ప‌ని చేశాను. ప్ర‌తిదీ చాలా ప్రొఫెష‌న‌ల్‌గా వెళ్ళాం. ఈ చిత్రంలో వాడిన లొకేష‌న్స్ అన్నీ క‌డా ఏ చిత్రంలోనూ ఉండ‌వు. సిమ్లా, మ‌నాలి, గోవా, హైద‌రాబాద్ , సిసు సౌత్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ వెళ్ళ‌ని లొకేష‌న్స్‌లో ఈ చిత్రాన్ని తీశాము. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వ‌చ్చింది. ఆర్‌.ఆర్‌.స‌త్యంగారు బాగా ఇచ్చారు. ఆయ‌న గ‌తంలో వంగ‌వీటి చిత్రానికి ఆర్ .ఆర్ ఇచ్చారు. క‌న్‌ఫ‌ర్మ్‌గా చెబుతున్నా ఈ చిత్రంతో నేను ఆగిపోను. ఇంకా ఎన్నో చిత్రాల‌ను తీస్తాను అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి బోర్డ్ చైర్మ‌న్ శివ‌కుమార్‌, కిర‌ణ్, గోవింద్‌ (క్రిష్ స్నేహితులు)హీరోయిన్ గ‌రీమా త‌దిత‌రులు పాల్గొన్నారు. క్రిష్‌, అశ్మిత‌, త్రిష‌, ముర‌ళిశ‌ర్మ‌, దేవ‌గిల్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి నిర్మాతః క్రిష్‌బండిప‌ల్లి, మ్యూజిక్ః ఉజ్జ‌ల్‌, సినిమాటోగ్ర‌పీ హ‌జ‌ర‌త్‌షేక్ (వ‌లి) ఎడిట‌ర్ః వినోద్ అద్వ‌య్‌, పిఆర్ ఓః ఏలూరుశ్రీ‌ను, కోడైరెక్ట‌ర్ః ప్ర‌సాద్‌, డైరెక్ట‌ర్ః బిఎన్ఎస్‌రాజు.