రీ రిలీజ్‌లోనూ ‘రతి నిర్వేదం’ ట్రెండ్‌ సెట్‌ చేస్తోంది –శోభారాణి

195


ప్రస్తుతం రీ – రిలీజ్‌ ట్రెండ్‌ బాగా నడుస్తోంది. ఒకప్పుడు హిట్‌ అయిన చిత్రాలను రీరిలీజ్‌ చేసి హిట్‌ అందుకుంటున్నారు మేకర్స్‌. 2011లో సంచలనం సృష్టించిన ఓ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యధార్థ సంఘటనలతో రూపొందిన ‘రతి నిర్వేదం’ చిత్రాన్ని ఈ నెల 13న గ్రాండ్‌ విడుదల చేయనున్నారు. శ్వేతా మీనన్‌, శ్రీజిత్‌ విజయ్‌ కీలక పాత్రధారులుగా టి.కె.రాజీవ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సి.ఎల్‌ఎన్‌ మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.

శోభారాణి మాట్లాడుతూ ‘‘రతి నిర్వేదం అనగానే ఇదొక హాట్‌ జానర్‌ చిత్రం అనుకోవచ్చు. కానీ చక్కని నవల ప్రేమకథ. టెండర్‌ లవ్‌స్టోరీతో డామాగా తెరకెక్కించారు. ఎమోషన్‌, డ్రామా, కామెడీ ఉన్న సినిమా. 1978లో ఇదే టైటిల్‌లో ఓ చిత్రం విడుదలై సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2011లో శ్వేతా మీనన్‌, శ్రీజిత్‌ విజయ్‌ కీలక పాత్రధారులుగా అదే చిత్రాన్ని రీమేడ్‌ చేశారు. అప్పట్లో ఈ చిత్రం మలయాళ, తమిళ భాషలతోపాటు తెలుగులో కూడా పెద్ద హిట్‌ అయింది. ప్రస్తుతం రీరిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోన్న ఈ తరుణంలొ ‘రతినిర్వేదం’ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తున్నాం. ఈ చిత్రం మొత్తాన్ని కేరళలో అందమైన ప్రాంతాల్లో షూటింగ్‌ చేశారు. పాటలన్నీ సిచ్చువేషనల్‌గా ఉంటాయి. హీరోహీరోయిన్‌ల మధ్య కెమిస్ట్రీ బావుంటుంది. రీ రిలీజ్‌లో కూడా ఈ చిత్రం మరో లెవల్‌కి వెళ్తుందని నమ్ముతున్నా. శ్వేతామీనన్‌ కూడా బాగా ప్రమోట్‌ చేస్తోంది. రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా పూర్తయింది. సి.ఎల్‌.ఎన్‌ మూవీస్‌ సంస్థ మంచిమంచి చిత్రాలను విడుదల చేస్తుంది. వచ్చే నెలలో కూడా మరో మంచి చిత్రాన్ని విడుదల చేయనుంది’’ అని అన్నారు.

శ్వేతా మీనన్‌, శ్రీజిత్‌ విజయ్‌ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రచయిత: పి.పద్మరాజన్‌, సంగీతం: ఎం.జయచంద్రన్‌; సినిమాటోగ్రఫీ ఫ మనోజ్‌ పిళ్లై, దర్శకుడు టి.కె రాజీవ్‌కుమార్‌.