HomeTeluguరాణిగారి గదిలో దెయ్యం ట్రైలర్‌ ఆవిష్కరణ

రాణిగారి గదిలో దెయ్యం ట్రైలర్‌ ఆవిష్కరణ

రోషన్‌, సాక్షి, స్రవంతి, పూజా డే కీలక పాత్రధారులుగా రూపొందుతున్న ‘రాణిగారి గదిలో దెయ్యం’. అబిద్‌ దర్శకత్వంలో మౌంట్‌ ఎవరెస్ట్‌ పిక్చర్స్‌ పతాకంపై పి.వి.సత్యనారాయణ నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేఽశంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్‌, ఆర్‌.కె.గౌడ్‌ ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల చేశారు. సినిమా విజయవంతం కావాలని అభిలషించారు. ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ‘‘హారర్‌ కంటెంట్‌ చిత్రాలకి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఈ చిత్రం సక్సెస్‌ కావాలి’’ అని అన్నారు.

నిర్మాత పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో వస్తున్న ఐదో సినిమా ఇది. హారర్‌ కాన్సెప్ట్‌తో వినోదాత్మకంగా సాగే చిత్రమిది. త్వరలో విడుదల చేస్తాం’’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నన్ను నమ్మి నిర్మాత అవకాశం ఇచ్చారు. హారర్‌ కథతో చక్కని సినిమా తీశాం. షేర్‌ చక్కని సంగీతం అందించారు. ఈ జర్నీలో చాలామంది నాకు సహకరించారు.

సిరాజ్‌ మాట్లాడుతూ ‘‘తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నా. నా మొదటి సినిమా నుంచి ప్రసన్నకుమార్‌ సపోర్ట్‌ చేస్తున్నారు. మంచి కథతో ఈ సినిమా చేశాం. చక్కని పాటలు కుదిరాయి. ఈ సినిమాలో అవకాశం పట్ల నటీనటులు ఆనందం వ్యక్తం చేసి, సినిమా సక్సెస్‌ కావాలని ఆకాంక్షించారు.

నటీనటులు:
రోషన్‌,
సాక్షి,
స్రవంతి,
పూజా డే
ఖలీల్‌ జాంబియా తదితరులు.

సాంకేతిక నిపుణులు:
కెమెరా: ప్రవీణ్‌
కొరియోగ్రఫీ: సాయిరాజ్‌
ఫైట్ష్‌: షోలిన్‌ మల్లేష్‌
కో డైరెక్టర్‌: పురం కృష్ణ, రాంబాబు
పి.ఆర్‌.ఓ. మధు వి.ఆర్‌
నిర్మాత: పి.వి.సత్యనారాయణ
దర్శకత్వం: అబిద్‌.

PRO;MADHU VR 

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES