యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’ ఆగస్టు 15 న విడుదల కానున్న విషయం విదితమే.
ఈ చిత్రానికి సంబంధించిన మూడవ గీతాన్ని ఈ రోజు విడుదల చేశారు. ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్’ అనే పల్లవి గల ఈ గీతాన్ని గీత రచయిత కృష్ణ చైతన్య రచించగా, సంగీత దర్శకుడు సన్నీ ఎం.ఆర్. సమకూర్చిన స్వరాలు అలరిస్తాయి. కథానాయకుడు శర్వానంద్, కాజల్ అగర్వాల్ లపై ఈ గీతాన్ని చిత్రీకరించారు. కధా పరంగా శర్వానంద్, కాజల్ అగర్వాల్ ల మధ్య చిత్రీకరించిన ఈ పాట క్లాస్,మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గాయని నిఖిత గాంధీ గళం ఈ పాటకు మరింత కొత్త దనాన్ని అందించింది. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదల అవుతుంది. చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 15 , 2019 న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు
.
ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి.
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్. నిర్మాత: సూర్యదేవర నాగవంశీ ,రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ