“కొత్తకా రెక్కలొచ్చెనా” లోగో & ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన ఉప్పెన టీం

472

వాలంటైన్స్ డే స సందర్భంగా రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించిన “కొత్తకా రెక్కలొచ్చెనా” సినిమా లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఉప్పెన చిత్ర యూనిట్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.

అనంతరం లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ..కోవిడ్ టైం లో అందరమూ ఎన్నో ఇబ్బందులతో ఎంతో బాధపడ్డాము. కొవిడ్ తర్వాత అందరికీ కొత్త రెక్కలు వచ్చినట్లు, న్యూ లైఫ్ బిగిన్ అయినట్లు భావిస్తున్నారు అలాగే ఈ సినిమా “కొత్తగా రెక్క.లొచ్చెనా”సినిమా ప్రజెంట్ జనరేషన్

ఆఫ్టర్ 80 తర్వాత ఉన్న జనరేషన్ కు ఉన్న ఎమోషన్స్ క్యారీ చేస్తూ ఈ మూవీ చేయడం జరిగింది .అట్లూరి పుండరీకాక్షయ్య పెద్దబ్బాయి ప్రదీప్ దర్శకుడిగా ఈ మూవీకి పరిచయం అవుతున్నాడు. “కొత్తగా రెక్కలొచ్చెనా “లోగోను ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు,నిర్మాత నవీన్ లు లాంచ్ చేయడం,ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో వైష్ణవ్ తేజ్,కృతి శెట్టిలు లు లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ…  వీళ్లను చూస్తుంటే నేను తీసిన స్టైల్ సినిమాలోని “తెలుగోడి స్టైలే దుమ్ములేపే స్టైలే” డైలాగ్ వీరికి కరెక్టు యాప్ట్ అవుతుంది.బుచ్చిబాబు సుకుమార్ గారికి ఉప్పెన రూపంలో మంచి గిఫ్ట్ ఇచ్చి గురువుని మించిన శిష్యుడు అని పించుకున్నారు.దర్శకుడు రస్టిక్ స్టోరీ తో మేకప్ లేకుండా ఈ కథను ఎంచుకొని అద్భుతమైన సినిమా తీశారు.హీరో మేకప్ లేకుండా న్యాచురల్ గా నటించి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చూపించాడు..హీరోయిన్ ఎమోషన్స్ ఫర్ఫార్మెన్స్ చూస్తుంటే మరో దీపికా పదుకొనే వచ్చినట్లు ఉంది.ప్రేమ పేరుతో వచ్చిన ఎన్నో సినిమాల క్లైమాక్స్ స్యాడ్ ఎండింగ్ తో ముగించాయి. కానీ ఈ సినిమా క్లైమాక్స్ చూసిన చూసిన ప్రేక్షకులకు రియల్ లైఫ్ లో ప్రేమపై మరింత గౌరవం పెంచేలా చేసింది.   “కొత్తగా రెక్కలొచ్చెనా” టీం తరుపున అభినందన సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు

మైత్రి మూవీ మేకర్స్ నవీన్ మాట్లాడుతూ..రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై తీసిన “కొత్తగా రెక్కలొచ్చెనా” సినిమా ద్వారా మా ఉప్పెన టీమ్ ను ఎంకరేజ్ చేయాలని ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము ఒక మంచి సినిమా చేస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఇది మళ్లీ ప్రూవ్ చేశారు .మేము ఈ సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అనుకున్నదానికంటే రోజురోజుకూ పెరుగుతున్నాయి హీరో హీరోయిన్లు చాలా బాగా నటించారు విజయ్ సేతుపతి నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది ఇది మాకొక కొత్త ఎక్స్పీరియన్స్.మాకింత విజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని అన్నారు

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ..”కొత్తగా రెక్కలొచ్చెనా” పాట అంటే ఎంతో ఇష్టం . ఆ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీ ఆ అందరికీ తెలుసు.ఆ పాటలా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని టీం కు విషెస్ తెలియజేస్తూ

ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ… “కొత్తగా రెక్కలొచ్చెనా” సినిమా శ్రీధర్ గారికి మంచి విజయం సాధించాలని తెలియజేస్తూ..ఈ చిత్రంలో మేము కొత్త వారిమైనా విజయ్ సేతుపతి గారు,బుచ్చి బాబు,నిర్మాతలు నాకు ఫుల్ సపోర్ట్ చేసి మా దగ్గర మంచి నటన రాబట్టుకున్నారు ఇలాంటి సినిమాల్లో నటించడం నేను అదృష్టం గా భావిస్తున్నాను నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు

హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ…”కొత్తగా రెక్కలొచ్చెనా” సినిమా పోస్టర్ చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది .ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని తెలియజేస్తూ..ఉప్పెన సినిమా లో దర్శకులు నన్ను ఒక పార్ట్ చేశారు.ఈ సినిమాకు ఇంత ఆదరణ రావడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ గారు నన్ను చాలా అందంగా చూపించారు ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.

నటీనటులు :-

విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్,
రిషిక ఖన్నా, వినీత్ భవిశెట్టి, స్నేహల్ కమల్,
అభిజిత్ దేశ్ పాండే,, జయశ్రీ రాచకొండ మొదలగువారు

టైటిల్ :- కొత్తగా రెక్కలొచ్చేనా

రైటర్ అని డైరెక్టర్ :- ప్రదీప్ బి అట్లూరి

ప్రొడ్యూసర్స్ :- శిరీష లగడపాటి & శ్రీధర్ లగడపాటి

డిఓపి :-అనీష్ తరుణ్ కుమార్

మ్యూజిక్ :-అచ్చు రాజమణి

ఎడిటర్ :- గ్యారి బిహెచ్

ప్రొడక్షన్ డిజైనర్ :-ఉదయ్ ఉమ గోపాల్

క్రియేటివ్ ప్రొడ్యూసర్ :- గోపీచంద్ లగడపాటి

క్యాస్థూమ్స్ :- భరత్ గాంధీ

ప్రొడక్షన్ హౌస్ :- రామ లక్ష్మి సినీ క్రియేషన్స్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాఘవేంద్ర అన్న

క్యాస్టింగ్ డిజైనర్ :- పుష్ప భాస్కర్

పి ఆర్వో :- రాజేష్

PRO; DASARI RAJESH