రామ్ గోపాల్ వర్మ, దాసరి కిరణ్ కుమార్ ల “వ్యూహం” మార్చి 2న విడుదల

73

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను నేపథ్యంగా తీసుకుని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సినిమాలు “వ్యూహం”, “శపథం”. ఈ సినిమాలను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీస్ లో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. వీటికి సెన్సార్ అడ్డంకులు తొలిగాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 2న “వ్యూహం” సినిమాని విడుదల చేస్తున్నారు.

నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ – “వ్యూహం”, “శపథం” సినిమాల రిలీజ్ విషయంలో దేవుడు మాకు అన్నీ కలిసొచ్చేలా చేశాడు. ఈ రెండు సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నాం. మా వ్యూహం గ్యారెంటీగా సక్సెస్ అవుతుంది. మాకు ఆ నమ్మకం వుంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది. వారికి కృతజ్ఞతలు.

నటీనటులు – అజ్మల్, మానస తదితరులు

టెక్నికల్ టీమ్ – డీవోపీ – సుజీష్ రాజేంద్రన్, ఎడిటర్– మనీష్ ఠాకూర్, పిఆర్వో– శివమల్లాల, నిర్మాత – దాసరి కిరణ్ కుమార్, దర్శకత్వం – రామ్ గోపాల్ వర్మ