రామ్ చరణ్ – యూ.వి. క్రియేషన్స్, య‌న్. వి. ఆర్ సినిమా – గౌతమ్ తిన్ననూరి

353

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే, ఇప్పటికే ఆర్. ఆర్. ఆర్ మూవీలో నటిస్తూ పాన్ ఇండియా అంతా అభిమానులని సంపాదించుకున్నారు రామ్ చరణ్, దాంతో పాటే భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో మరో సినిమా చేస్తున్నారు. ఇక తాజాగా మిర్చి, సాహో, భాగమతి, రాథే శ్యామ్ వంటి భారీ సినిమాలు నిర్మిస్తూ పాన్ ఇండియా రేంజ్ లో భారీ చిత్రాలు నిర్మించే సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న యూ.వి. క్రియేషన్స్ వారి బ్యానర్ లో తీయనున్న చిత్రంలో నటిస్తుండటం విశేషం. ఈ సినిమాకు జెర్సీ చిత్రం తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని యూ. వీ. క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్, విక్రమ్ లు తెలిపారు. ఈ చిత్రాన్ని యూ.వి. క్రియేషన్స్ తో క‌లిసి మరో అగ్రగామి సంస్థ యన్.వి.ఆర్ సినిమా వారు నిర్మిస్తున్నారు.

నటీనటులు

రామ్ చ‌ర‌ణ్

సాంకేతిక నిపుణులు

బ్యానర్ : యు.వి.క్రియేషన్స్, ఏన్ వి ఆర్
నిర్మాతలు : వంశీ, ప్రమోద్, విక్రమ్, ఎన్.వి. ప్ర‌సాద్
దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, వంశీ కాక‌

Eluru Sreenu
P.R.O