ప్రి-రిలీజ్ వేడుక “రామ్ అసుర్” నవంబర్ 19 న గ్రాండ్ రిలీజ్*

237


*ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్ నటీనటులుగా వెంక‌టేష్ త్రిప‌ర్ణ దర్శకత్వంలో అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న “పీనట్ డైమండ్” చిత్రం మాస్ ఆడియన్స్ కు రీచ్ కావాలని ఈ చిత్ర టైటిల్ ను `రామ్ అసుర్`గా మార్చడమైనది. ఈ చిత్రంలోని పాటను టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేయగా ఆ పాటకు విశేష స్పందన లభించింది.అలాగే ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్రిలీజ్ చేయడం విశేషం .సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి జె. ప్ర‌భాక‌రరెడ్డి ఛాయాగ్ర‌హ‌కుడిగా వ్య‌వ‌హ‌ రిస్తున్నారు. ప్రేక్షకులలో మంచి క్రేజ్ ను దక్కించుకున్న ఈ సినిమాకి `బెంగాల్ టైగ‌ర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమ కూరుస్తున్నారు.ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా సినిమా పై కూడా మంచి అంచనాలు పెంచాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న `రామ్ అసుర్` చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 19 న ఎంతో గ్రాండ్ గా థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుంది.ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో సినీ అతిరథుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకులు మారుతి, నిర్మాత బెల్లంకొండ సురేష్, దర్శకుడు హరినాథ్, నిర్మాత బెక్కం వేణుగోపాల్,నిర్మాత రాజ్ కందుకూరి,ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు, ఇన్ కమ్ ట్యాక్స్ ఆడిషనల్ కమీషనర్ జీవన్ లాల్ ఐ.ఆర్.యస్, గోపాల్,నటులు విజయ్ శంకర్, సాయి,నవీన్,సోలో బ్రతుకే సో బెటర్ డైరెక్టర్ సుబ్బు, ఆర్.కె,తదితరులు పాల్గొని చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియ జేశారు. దర్శకుడు మారుతి ప్రి రీలీజ్ ట్రైలర్ ను విడుదల చేయగా, దర్శకుడు బుచ్చి బాబు “ఎం చేశావే మాయ మాయ”సాంగ్ ను లాంచ్ చేశారు. అనంతరం “రామ్ అసుర్” మొదటి బిగ్ టికెట్ ను దర్శకులు మారుతి,నిర్మాత బెల్లంకొండ సురేష్ లు విడుదల చేసి ఫస్ట్ టికెట్స్ ను కొనుగోలు చేశారు.అనంతరం

*ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకుడు మారుతి మాట్లాడుతూ* ..వెంకటేస్ మా బ్యానర్ లోని ఈ రోజుల్లో సినిమాకి పని చేశాడు అప్పుడు కూడా తను కథ చెప్పడానికి ట్రై చేసే వాడు. అప్పుడే తను మంచి దర్శకుడు అవుతాడను కొన్నాను. ఆ తర్వాత చెన్నైలో వర్క్ చేసి వచ్చి నాకు ఒక కథ చెప్పాడు నీలో మంచి డైరెక్టర్ వున్నాడు చేయమని సపోర్ట్ చేశాను.ఆ తర్వాత ఈ సినిమా ట్రైలర్ తీసుకువచ్చి నాకు చూపించాడు.చిత్ర ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది.మనము తీసిన సినిమాను ఆడియన్స్ డిసైడ్ చేస్తారు మన ప్రయత్నాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు తను చేసిన ఈ మొదటి ప్రయత్నంమే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ దాక తీసుకువచ్చాడు అంటే తన వెనక ఎంత కష్టం ఉంతుందో నాకు తెలుసు.డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఇప్పటి వరకూ ఇటువంటి కాన్సెప్ట్ సినిమా రాలేదు.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది అన్నారు

*చిత్ర దర్శక, నిర్మాత వెంక‌టేష్ త్రిప‌ర్ణ మాట్లాడుతూ** .. మాది ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం మా తల్లిదండ్రులు ఏంతో కష్టపడి నన్ను చదివించు కుంటూ నన్ను ఎంకరేజ్ చేసి ఈరోజు ఈ స్టేజికి తీసుకువచ్చారు. నేను ఈరోజు ఈ స్టేజ్ పైన ఉండడానికి కారణం మా తల్లిదండ్రులు వారికి నా పాదాభివందనాలు.నన్ను బ్లెస్స్ చేయడానికి ఎంతోమంది నా ఫ్రెండ్సు శ్రేయోభిలాషులు మా ఊరైన తుని నుండి వచ్చారు వారందరికీ నా ధన్యవాదాలు. జీవితంలో నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులు ఇద్దరు వారిలో మొదటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి వారిని వ్యక్తి అనే దానికంటే దేవుడు అంటే సబబుగా ఉంటుంది 1980, 90 లలో ఎన్నో లక్షల మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు.   బుచ్చిబాబు గారు,సుబ్బు గారు ఇలాఇలా ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించండి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాను నేను రాసుకున్న కంటెంట్ ను అనుకున్నది అనుకున్నట్లు చేయడం జరిగింది దానికి కారణం

*చిత్ర హీరో, నిర్మాత అభిన‌వ్ స‌ర్ధార్‌ మాట్లాడుతూ*..మధ్యతరగతి కుటుంబం నేను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాను.వ్యవసాయం చేసే మా నాన్న ఎంతో కష్టపడి చదివించాడు.ఈరోజు నేను ఈ స్టేజ్ మీదకు వచ్చాను అంటే దానికి కారణం మా తల్లిదండ్రులు మరియు మా అన్నయ్యలు. మా పెద్దన్న లాల్, చిన్న అన్న డాక్టర్ జవహర్ లాల్వారు నాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి సరైన దారిలో వెళ్లేలా తీసుకొచ్చి నన్ను నిల్చోబెట్టారు మా అన్నయ్యలు.నేను చిన్నప్పుడు చేయాలనుకున్న కలలను నిజం చేసుకోవాలి అనుకొని కష్టపడుతూ ఆ కలలను నెరవేర్చుకుంటూ వస్తున్నాను.ఈ రోజు వరకు కూడా నేను ఏం చేస్తున్నా మా అన్నలకు నామీద ఫుల్ కాన్ఫిడెన్స్.నేను ఏం చేసినా పదిమందికి ఉపయోగపడే పని చేస్తాను. నేను సంపాదించిన దాంట్లో 10% కాంట్రిబ్యూట్ చేస్తాను.దీనికి సపోర్ట్ గా నా ఫ్రెండ్స్ శ్రీధర్, విశ్వ, వాసు
నేను ఏమి యాక్టివిటీ చేసిన నాకు ఎప్పుడూ తోడుగా ఉంటారు.లైఫ్ లో ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి.వాటిని నిజం చేసుకోవాలంటే మనం 100% డెడికేషన్ తో పని చేయాలి దాంట్లో ఫెయిల్ అయిన పర్వాలేదు గానీ ట్రై చేయాలి.అలా చేస్తే కచ్చితంగా సక్సెస్ సాధిస్తారు.

*సహ నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ* ..కరోనా టైంలో మేమంతా ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకొని చాలా తక్కువ బడ్జెట్ లో సినిమా తీయాలని ప్లాన్ చేశాము.  హీరోయిన్ చాందిని చాలా సంవత్సరాలు గా మాతో ట్రావెల్ అవుతుంది. తమిళ్ లో నటిస్తున్న తనకు తెలుగులో కూడా మంచి పేరు రావాలి.తను ఈ చిత్రంలో చాలా బాగా నటించింది.మేము అనుకున్న దానికన్నా చాలా చక్కగా తీశాడు దర్శకుడు వెంకటేష్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నా ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఈ బ్యానర్ లో మేము తీస్తున్న మొదటి ప్రాజెక్టు “రామ్ అసుర” ను ఈనెల 19న కార్తీక పౌర్ణమి రోజున మా సినిమాను విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులందరూ మా సినిమాను సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

*హీరోయిన్ చాందిని మాట్లాడుతూ..* దర్శకుడు వెంకటేష్ గారితో 2013 లో ఇద్దరం కలిసి వర్క్ చేశాము. చాలా ప్యాషనేట్ వున్నా దర్శకుడు. అప్పుడే నేను తీయబోయే సినిమాకు నువ్వే హీరోయిన్ గా చెయ్యాలని చెప్పాడు. .ప్రభాకర్ రెడ్డి గారు సినిమాలో నన్ను చాలా అందంగా చూపించారు.సినిమా బాగా వచ్చింది త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా అందరికీ కచ్చితంగా వస్తుంది ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు

*మరో హీరోయిన్ ను చెర్రీ మాట్లాడుతూ* ..ఇంతవరకు రానటువంటి ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు వాదాలు

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

*నటీనటులు* :
అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, సుమన్,శుభలేఖ సుధాకర్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్ త‌దిత‌రులు

*సాంకేతిక నిపుణులు :*
సినిమాటోగ్ర‌ఫి: జె. ప్ర‌భాక‌ర రెడ్డి,
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఫైట్స్‌: శ‌ంక‌ర్‌.యు,
లైన్ ప్రొడ్యూస‌ర్‌: శ్రీ‌నిధి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : శాని సాల్మాన్‌‌,
పి.ఆర్‌.ఓ: సాయి స‌తీష్‌,
నిర్మాత‌లు : అభిన‌వ్ స‌ర్ధార్‌,వెంక‌టేష్ త్రిప‌ర్ణ,
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: వెంక‌టేష్ త్రిప‌ర్ణ.