`రాక్షసుడు` వంటి హిట్ మూవీ ఇచ్చిన కొనేరు సత్యనారాయణగారికి థ్యాంక్స్ – బెల్లంకొండ శ్రీనివాస్

546

యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా `రైడ్‌`, `వీర` చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో ఏ స్టూడియోస్‌, ఎ హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందిన చిత్రం `రాక్షసుడు`. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగాఆగ‌స్ట్ 2న విడుద‌ల చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్‌తో సక్సెస్‌పుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో…
దర్శకుడు రమేశ్ వర్మ మాట్లాడుతూ – “కొనేరు సత్యనారాయణగారు ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకుని నాతో డైరెక్ట్ చేయాలనుకోగానే, చాలా మంది అతను డిజాస్టర్ తీసే రెండేళ్లు అవుతుంది. అతనితో ఎందుకీ సినిమా అని కూడా అన్నారు. సరే.. సార్ నిర్ణయం కోసం వెయిట్ చేశాను. ఆయనేమో `రమేష్ నేను నువ్వు డైరెక్ట్ చేసిన రైడ్ సినిమా చూశాను. ఆ టెంపో నాకు ఎంతో నచ్చింది. నువ్వే ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తున్నావ్.అన్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ – “ఈరోజు నాకు చాలా మెమొరబుల్ డే. మార్నింగ్ నిద్ర లేవగానే ఓవర్‌సీస్ నుండి మా కజిన్స్ ఫోన్ చేశారు. అందరూ సినిమా గురించి పాజిటివ్‌గా చెప్పారు. ఆ పాజిటివ్ వైబ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజు కోసం రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నాను. ఇంత మంచి హిట్ ఇచ్చిన సత్యనారాయణగారికి జన్మంతా రుణపడి ఉంటాను. ఈ సినిమా రైట్స్ కోసం పెద్ద పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. సత్యనారాయణగారు ఖర్చుకు వెనకాడకుండా రైట్స్‌ను కొని మాపై నమ్మకంతో మాకు ఇవ్వడమే బిగ్గెస్ట్ సక్సెస్ అని భావిస్తున్నాను.