HomeTelugu“రాక్షసుడు“ నిర్మాత కోనేరు సత్యనారాయణ ఇంటర్వ్యూ..

“రాక్షసుడు“ నిర్మాత కోనేరు సత్యనారాయణ ఇంటర్వ్యూ..

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రాక్షసుడు“. తమిళంతో విజయవంతమైన “రాక్షసన్” చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఏ హావిష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్స్ బ్యానేర్ పై ప్రముఖ విద్యా వేత్త కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానేర్ పై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని ఆగష్టు 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కోనేరు సత్యనారాయణ ఇంటర్వ్యూ..

ప్రఖ్యాత కెఎల్ యూనివర్సిటీకి విజయవాడ ఛైర్మన్ అయుండి నిర్మాణం వైపు ఎందుకు వచ్చారు ?
– దాదాపు నాలుగు దశాబ్ధాలుగా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నాను. మా కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీ నేషనల్ వైజ్ గా ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లాస్ట్ ఇయర్ నుండి హైదరాబాద్ లో కూడా మా బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. జీనియస్ అని మా అబ్బాయి హవీష్ హీరోగా చేసిన చిత్రానికి గతం లో పని చేసి నప్పటికీ పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. అయితే సినీ నిర్మాణం వైపు రావడానికి కారణం మాత్రం మా అబ్బాయి హవీషే. ఆ అనుభవంతోనే ఇప్పుడు ‘రాక్షసుడు’ సినిమాకు ఏ హవీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్ స్థాపించి పూర్తి స్థాయి నిర్మాణ భాద్యతలు చేపట్టాను. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాతోనే పూర్తిస్థాయి నిర్మాతగా మారాను.
ఈ స్క్రిప్ట్ నే ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా ?
– నేను ఈ సినిమాను తమిళ్ లో విడుదలైన వారం రోజుల్లోనే చూసాను. తమిళంలో విజయవంతమైన “రాక్షసన్” సినిమాని ‘రాక్షసుడు’ పేరుతో తెలుగులోకి రీమేక్ చేస్తున్నాం. ముందు మా హవీష్ కోసం “రాక్షసన్” చూసాను. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అయితే అప్పటికే హవీష్ ఇలాంటి జోనర్ లోనే ఆల్ రెడీ ఓ సినిమా చేస్తున్నాడు. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా తీసుకున్నాము.
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెర్ఫామెన్స్?
– బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా లు నేను తక్కువగా చూశాను. అయితే ఈ కథకు తను బాగుంటాడని అనుకోని తనని హీరోగా తీసుకోవడం జరిగింది. మేము అనుకున్నట్లే నిజంగా శ్రీనివాస్ చాల మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఎమోషన్ని అండ్ యాక్షన్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఈసినిమాకు సాయి నటన కూడా ప్లస్ అవుతుంది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఎవరి ఛాయిస్?
– ఈ సినిమాలో హీరోయిన్ టీచర్ రోల్ లో కనిపిస్తుంది దాని కోసం మొదట చాలా మందిని అనుకున్నాం. అందులో రాశి ఖన్నాకూడా ఒకరు. అయితే ఈ క్యారెక్టర్ కి అనుపమ అయితే జస్టిస్ చేయగలదని అనుపమ పరమేశ్వరన్ తీసుకున్నాం. తను చాలా బాగా నటించింది. కథలో వచ్చే కీలక మార్పు కి ఆమె క్యారెక్టర్ కారణం అవుతుంది. బిజినెస్ అయిపోయిందండి. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ రేటుకే మా సినిమా రైట్స్ అమ్ముడయ్యాయి. అలాగే డిజిటల్స్ రైట్స్ జెమినివారు తీసుకోవడం జరిగింది. హిందీ రైట్స్ కూడా అమ్ముడయ్యాయి. ఇక అభిషేక్ పిక్చర్స్ వారు మా రాక్షసుడు సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ తీసుకున్నారు. అందుకు వారికి కూడా ధన్యవాదాలు.
మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి ?
– రెండు మూడు కథలు రెడీ గా ఉన్నాయి. అందులో మా అబ్బాయి హవీష్ తో కూడా ఓ సినిమా చేస్తున్నాము. అలాగే యంగ్ టాలెంట్ తో వచ్చే నూతన దర్శకులు, నటీనటులతో పనిచేస్తాం. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES