రాజుగారిగ‌ది 3` సెన్సార్ పూర్తి… అక్టోబ‌ర్ 18న విడుద‌ల‌

516


హార‌ర్ కామెడీ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో రూపొందిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం `రాజుగారిగ‌ది`. ఈ స‌క్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో భాగం `రాజుగారిగ‌ది 3`. అశ్విన్‌బాబు, అవికాగోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేస్తున్నారు. ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సినిమా నిర్మిత‌మైంది. ష‌బీర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి.

న‌టీన‌టులు:
అవికాగోర్‌
అశ్విన్ బాబు
అలీ
బ్ర‌హ్మాజీ
ప్ర‌భాస్ శ్రీను
హ‌రితేజ‌
అజ‌య్ ఘోష్‌
ఊర్వ‌శి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: ఓంకార్‌
బ్యాన‌ర్‌: ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: క‌ల్యాణి చ‌క్ర‌వ‌ర్తి
సినిమాటోగ్ర‌ఫీ: ఛోటా కె.నాయుడు
ఎడిట‌ర్‌: గౌతంరాజు
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సాహి సురేశ్‌
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
పాటలు: శ‌్రీమ‌ణి
ఆడియోగ్ర‌ఫీ: రాధాకృష్ణ‌
స్టంట్స్‌: వెంక‌ట్‌
పి.ఆర్‌.ఒ: వంశీ శేఖ‌ర్‌