‘రాఘవ రెడ్డి’గా రానున్న శివ కంఠమనేని

551

‘అక్కడొకటుంటాడు’ ఫేమ్ శివ కంఠమనేని కథానాయకుడిగా లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం. 2గా రూపొందుతోన్న చిత్రానికి ‘రాఘవ రెడ్డి’ టైటిల్ ఖరారు చేశారు. ‘criminals can not escape’ అనేది ఉపశీర్షిక. సంజీవ్‌ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జి. రాంబాబు యాదవ్‌, ఆర్‌. వెంకటేశ్వరరావు, కె.ఎస్‌. శంకరరావు నిర్మాతలు. యువ కథానాయిక నందితా శ్వేత, రాశి ప్రధాన తారాగణం. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రముఖ పబ్‌లో శివ కంఠమనేని, స్నేహా గుప్తా తదితరులపై తెరకెక్కిస్తున్న ‘చదివిందే నే టెన్త్ రో… అయ్యింది డాక్టర్’ పాటను తెరకెక్కిస్తున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. షూటింగ్ లొకేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టైటిల్ ప్రకటించారు.

ఈ సందర్భంగా అజయ్ ఘోష్ మాట్లాడుతూ “తొలుత ఈ సినిమాకు చాలా టైటిల్స్ అనుకున్నాం. చివరకు, మా యూనిట్ ‘రాఘవ రెడ్డి’ టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ నాతో అనౌన్స్ చేయిస్తారని అసలు ఊహించలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్న సినిమాగా ప్రారంభమైన ‘రాఘవ రెడ్డి’ ఈ రోజు పెద్ద సినిమా అయింది. ఇందులో నేను మెయిన్ విలన్ గా నటిస్తున్నాను” అని అన్నారు.

హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ “నేను హీరోగా నటించిన ‘అక్కడొకడుంటాడు’ మంచి విజయం సాధించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే విశ్వాసం ఉంది. కొత్త కాన్సెప్టుతో తీస్తున్న చిత్రమిది. తెలుగు సినిమాల్లో నవరసాలు ఉంటాయి. అలాగే, మా సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది క్లైమాక్స్. దర్శకుడు ఎమోషనల్ ఎండింగ్ ఇచ్చారు. అందులో నటీనటులు అందరూ ఉంటారు. అజయ్ ఘోష్ కామెడీ విలన్ గా అద్భుతంగా చేశారు” అని అన్నారు.

దర్శకుడు సంజీవ్‌ మేగోటి మాట్లాడుతూ “చాలా ఏళ్ల క్రితం తెలుగులో ‘అఘోరా’తో పాటు కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాను. తర్వాత కన్నడకు వెళ్లాను. అక్కడ మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాను. కానీ, నాలో ఓ వెలితి. నా మాతృభాష తెలుగులో సరైన సక్సెస్ లేదని. అందుకని, తెలుగులోకి వచ్చి ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో నన్ను నేను నిరూపించుకోవాలని అనుకుంటున్నాను. అని అన్నారు.

నిర్మాతలలో ఒకరైన రాంబాబు యాదవ్ మాట్లాడుతూ “సినిమా టాకీ పూర్తయింది. ఈ పాటతో సినిమా చిత్రీకరణ అంతా పూర్తవుతుంది. మరో రెండు రోజులు ఈ పాటను చిత్రీకరిస్తాం. సినిమా చాలా బాగా వచ్చింది. దర్శకుడు సంజయ్ మాకు కథను చెప్పిన దానికంటే చాలా అద్భుతంగా తెరకెక్కించారు “

నటి స్నేహా గుప్తా మాట్లాడుతూ “నేను ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా హీరో, దర్శకుడు, నిర్మాతలకు థాంక్స్” అని అన్నారు.

శివ కంఠమనేని, నందితా శ్వేత, రాశి, శ్రీనివాసరెడ్డి, అజయ్‌, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్‌, ‘బిత్తిరి సత్తి, రఘుబాబు, అజయ్‌ ఘోష్‌, ఆదిత్యా మీనన్‌, అన్నపూర్ణమ్మ, ‘చమ్మక్’చంద్ర, మీనా కుమారి, బీహెచ్ఈఎల్ ప్రసాద్, ఆర్. వెంకటేశ్వరరావు, చంద్రకాంత్, లాబ్ శరత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.

సాంకేతిక నిపుణుల వివరాలు….
స్టంట్స్‌: ‘సింధూరం’ సతీష్‌కొరియోగ్రఫీ: భాను, కిరణ్
కూర్పు: ఆవుల వెంకటేశ్‌
కళా దర్శకుడు: కె.వి. రమణ
మాటలు: అంజన్‌పాటలు: సాగర్ నారాయణ
ఛాయాగ్రహణం: ఎస్.ఎన్. హరీష్‌
ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: గంటా శ్రీనివాసరావు
నిర్మాణ సంస్థ పేరు: లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌
సంగీత దర్శకులు: యశస్వినీ గున్ను, సుధాకర్‌ మారియో
నిర్మాతలు: జి. రాంబాబు యాదవ్‌, ఆర్‌. వెంకటేశ్వరరావు, కె.ఎస్‌. శంకరరావుకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: సంజీవ్‌ మేగోటి