ఎప్రిల్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్న రెబల్ స్టార్ ప్రభాస్ బిగ్గెస్ట్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’..

570

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఇండియా లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’. మార్చ్ 11న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ప్రభాస్‌ను లవర్ బాయ్‌గా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. భాషతో సంబంధం లేకుండా అన్నిచోట్ల ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ప్రభాస్, పూజా హెగ్డే కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయిపోయారు. అలాగే రాధాకృష్ణ కుమార్ టేకింగ్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణ. అద్భుతమైన సెట్లు.. దానికి మించిన విజువల్ ఎఫెక్ట్స్ రాధే శ్యామ్ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఈ సినిమా నిర్మాతలకు బ్రేక్ ఈవెన్ అయిపోయింది. తాజాగా అభిమానులకు మరో తీపి కబురు చెప్పారు రాధే శ్యామ్ యూనిట్. ఎప్రిల్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మ్యాజికల్ లవ్ జర్నీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేసారు. అమెజాన్‌లో ఈ ప్రేమకథను చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని.. ఎప్రిల్ 1 నుంచి కచ్చితంగా అంతా రాధే శ్యామ్‌తో ప్రేమలో పడిపోతారని చెప్తున్నారు దర్శక నిర్మాతలు. గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మాతలు.

నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు..

టెక్నికల్ టీమ్:

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్
సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: నిక్ పావెల్‌
డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రవీందర్
సౌండ్ ఇంజ‌నీర్‌: ర‌సూల్ పూకుట్టి
ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్
పిఆర్ఓ : ఏలూరు శ్రీను

,
Eluru Sreenu
P.R.O