HomeTeluguరాధ టీఎంటీ టీచ్‌ ఫర్‌ యాన్యువల్‌ ఫండ్‌ రైజర్‌

రాధ టీఎంటీ టీచ్‌ ఫర్‌ యాన్యువల్‌ ఫండ్‌ రైజర్‌


రాధ టీఎంటీ టీచ్‌ ఫర్‌ యాన్యువల్‌ ఫండ్‌ రైజర్‌ కార్యక్రమంతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న సెలబ్రేటెడ్‌ కోటురియర్స్‌ శాంతను –నిఖిల్‌ పెగా సిస్టమ్స్‌ మద్దతునందించిన ఈ నిధుల సేకరణ కార్యక్రమం వెస్టిన్‌ హైదరాబాద్‌ మైండ్‌స్పేస్‌ హోటల్‌లో జరిగింది. హియా డిజైనర్‌ జ్యువెలరీ వేర్‌తో సినీతారలు ర్యాంప్‌ వాక్‌ చేశారు నటి లక్ష్మీమంచు నిర్వహణలో హైదరాబాద్‌ మైండ్‌స్పేస్‌ హోటల్‌లో రాధ టీఎంటీ టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం ఏప్రిల్‌ 3వ తేదీ జరిగింది. ఈ వినూత్నమైన కార్యక్రమంలో పలువురు సినీ తారలు ర్యాంప్‌ వాక్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలన్న మహోన్నత లక్ష్యంతో నిర్వహించిన ఈ ర్యాంప్‌వాక్‌కు సుప్రసిద్ధ డిజైనర్‌ ద్వయం శాంతను–నిఖిల్‌ తమ మద్దతునందించారు. సెలబ్రిటీలు వీరి కలెక్షన్‌తో పాటుగా హియా డిజైనర్‌ జ్యువెలరీ ధరించి ర్యాంప్‌ వాక్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఐఎల్‌ డైరెక్టర్‌ శ్రీమతి సుధా రెడ్డి, బయలాజికల్‌ ఈ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీమతి మహిమా దాట్ల ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి రేణుకా చౌదరి, డిప్యూటీ హై కమిషనర్‌–యుకె కాన్సులేట్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌, డాక్టర్‌ జె గీతారెడ్డి, డాక్టర్‌ ఎం మోహన్‌బాబు, కార్పోరేట్‌ లీడర్లు, ప్రభుత్వ అధికారులు– శ్రీ జయేష్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమానికి రాధ టీఎంటీ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించగా, వెస్టిన్‌ ఆతిథ్యం అందించింది. ట్రెబ్‌ కాన్సెప్ట్స్‌ పవర్డ్‌ బై పార్టనర్‌గా ద ట్రైబ్‌ కాన్సెప్ట్స్‌ వ్యవహరించాయి. ఈ కార్యక్రమానికి భాగస్వాములుగా నవ స్కిన్‌ క్లీనిక్‌, లడ్డు బాక్స్‌, సెంట్రో, కమల్‌ వాచ్‌ అండ్‌ కో, స్టెల్లార్‌, వియ్‌ కనెక్ట్‌, మింటు శర్మ, రాయల్‌ లియో క్లబ్‌ , వివిడో, సిల్వర్‌ స్టార్‌ మెర్సిడెస్‌ బెంజ్‌ వ్యవహరించాయి.

నటులు అదితి రావు హైదరీ, అఖిల్‌ అక్కినేని, లక్ష్మీ మంచు, ప్రగ్యాజైశ్వాల్‌, సందీప్‌ కిషన్‌, మానస వారణాసి, సుధీర్‌ బాబు, రోహిత్‌ ఖండేల్‌వాల్‌, ఈషా రెబ్బా, అదిత్‌ అరుణ్‌, నవదీప్‌, నివేతా పేతురాజ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో ర్యాంప్‌ వాక్‌ చేశారు.

2014లో చైతన్య ఎంఆర్‌ఎస్‌కె, లక్ష్మీ మంచు ప్రారంభించిన ఈ టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ ట్రస్ట్‌ ఓ జాతీయ ఉద్యమంగా అక్ష్యరాస్యత పెంచడంలో తోడ్పడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యనందించడంలో టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ తోడ్పడుతుంది. తెలంగాణాతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడులలో ఈ సంస్థ కార్యకలాపాలు జరుగుతున్నాయి.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES