యూత్ ని మెప్పించే ‘రావే నా చెలియా”

539

సూర్య చంద్ర ప్రొడక్షన్ బ్యానర్‌లో నెమలి అనిల్, సుభాంగి పంత్, విరాజ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రావే నా చెలియా’. కీర్తి శేషులు నెమలి సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్వర్ రెడ్డి దర్శకుడు. ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: గగన్(అనిల్) మంచి దర్శకుడు అవ్వాలని ఎప్పుడూ తపిస్తూ ఉంటాడు. అందుకోసం ఓ ప్రొడక్షన్ హౌస్ తో కలిసి సినిమా తీయడానికి వైజాగ్ బయలుదేరి వెళ్తాడు. ఈ జర్నీలో వైల్డ్ ఫోటోగ్రాఫర్ రాజేశ్వరి(సుభాంగి పంత్) పరిచయం అవుతుంది. తను తీయబోయే సినిమాలో హీరోయిన్ గా రాజేశ్వరి ని ఫిక్స్ చేసుకోవాలని ట్రై చేస్తాడు. అయితే ఆమె అంగీకరించదు. హీరోయిన్ లాంటి మంచి ఛాన్స్ ను రాజేశ్వరి ఎందుకు రిజెక్ట్ చేసింది? అందుకు కారణాలు ఏంటి? గగన్ తన చిత్రాన్ని ఏ హీరోయిన్ తో కంప్లీట్ చేశాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: ముక్కోణపు ప్రేమ కథా చిత్రాలు ప్రేక్షకులకు ఎప్పుడూ ఎగ్జైటింగ్ గానే ఉంటాయి. ఇందులో కూడా దర్శకుడు డెబ్యూ హీరోలతో ఓ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెరకెక్కించి ఆడియన్స్ ని అలరించారు. పరిస్థితులను బట్టి ఒకరి మీద ఉన్న ప్రేమ మరొకరి మీదకు మారుతూ ఉంటుందని… దాన్ని అర్థం చేసుకుంటేనే జీవితం సుఖ సంతోషాలతో హాయిగా సాగిపోతుందనే కోణాన్ని దర్శకుడు మంచి ఎమోషన్స్ తో… చాలా కన్విన్సింగ్ గా తెరమీద చూపించారు. ముక్కోణపు ప్రేమ కథను సీరియస్ గా ఓ వైపు రన్ చేస్తూనే మరోవైపు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ తోనూ… గ్యారేజ్ లో రచ్చరవి తోనూ కామెడీ ట్రాక్ నడిపించారు. మాస్ ప్రేక్షకులకోసం ఓ రెండు భారీ యాక్షన్ సీన్స్… హీరో హీరోయిన్ పై ఓ మాంచి మాస్ బీట్ సాంగ్ ను చిత్రీకరణ చేశారు. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా “రావే నా చెలియా” చిత్రాన్ని తెరకు ఎక్కించారు.

నెమలి అనిల్ డెబ్యూ హీరోనే అయినా… యాక్షన్ సీన్స్, డ్యాన్స్ బాగా చేశారు. ఎక్కడా తడబాటు లేకుండా బాగా మెచ్యూర్ గా… సెటిల్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.. హీరోయిన్ కూడా చాలా క్యూట్ గా కనిపించి మెప్పించింది. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేసింది. ఫ్లాష్ బ్యాక్ లో విరాజ్ ప్రేమ కథ… ఆ తరువాత క్లయిమ్యాక్స్ సన్నివేశాలు అన్నీ ఆకట్టుకుంటాయి. రచ్చరవి అండ్ అదర్ కామెడీ పాత్రలు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. విరాజ్ తల్లి పాత్రలో సీనియర్ నటి కవిత నటించి ఎప్పటి లాగే మెప్పించారు.

దర్శకుడు మహేష్ రెడ్డి ఓ ట్రైయాంగిల్ లవ్ ఎంటర్టైనర్ స్టోరీని యూత్ కి నచ్చేలా తీసి సక్సెస్ అయ్యారు. ఎక్కడా బోరింగ్ లేకుండా క్లీన్ మూవీగా ఆడియన్స్ కి అందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అదనపు బలం ప్రతి ఫ్రెమూ బాగుంది. యాక్షన్ సీన్స్ గానీ.. మాస్ బీట్ సాంగ్ చాలా రిచ్ గా తెరకెక్కించారు. సంగీతం బాగుంది. ఎడిటింగ్ బాగుంది. స్వర్గీయ నెమలి సురేష్… ఖర్చుకు వెనకాడకుండా రిచ్ గా సినిమాను నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్..!
రేటింగ్ : 3