HomeTeluguనేడు ' రాస్ మెటానోయా' గాంధీ విడుదల

నేడు ‘ రాస్ మెటానోయా’ గాంధీ విడుదల


న్యూయార్క్ లో ఉంటున్న ‘చిసేల్డ్’ అంతర్జాతీయ అవార్డు దర్శకుడు రామ్ అల్లాడి చిన్ననాటి నుంచి వెంటాడుతున్న గాంధీఇజమ్ స్పూర్తితో మహాత్మా గాంధీ జీవిత చరిత్ర లోని ముఖ్య ఘట్టాలతో రాస్ మెటానోయా సినిమా ను అద్భుత గ్రాఫిక్స్ సెట్టింగ్స్ తో హాలీవుడ్ స్థాయిలో నిర్మించి నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మేజిక్ స్పెల్ అఫ్ ఎ బుక్ ఆధారంగా పూర్తిగా అమెరికా లోనే షూటింగ్ నిర్మాణం పూర్తీ చేసినట్లు దర్శకుడు రామ్ అల్లాడి తెలిపారు. బాపూజీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ బాల్యం నుంచి అయన 1948 లో మరణం వరకు ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. సంగీతం కూడా ఒక స్ఫూర్తినిచ్చేలా సమకూరిందని, నోబెల్ బహుమతి గ్రహీత దివంగత రవీంద్రనాథ్ ఠాగూర్ పాట “ఎక్లా చలో” ఈ సినిమాలో హైలెట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.వాచ్. మెటానోయా.ఫిల్మ్ ఓటిటి ద్వారా ఈ సినిమా విడుదల చేస్తున్నారు. గాంధీ అమర్ రహే నినాదం చిన్నప్పటి నుంచి ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా వర్ధిల్లుతున్నదని, ఢిల్లీ లో గాంధీ మ్యూజియం సందర్శించినప్పుడు అక్కడి వారి వస్తువులు భద్ర పరచిన తీరు, ఆఖరకు శాలువా పై గాంధీ రక్తపు చుక్కలను అలాగే భద్రం చేసి చూపిస్తున్న తీరు తనను ఆకర్షించి ఈ సినిమా ను చాలా శ్రమించి రూపొందించానని, ప్రపంచానికి మహాత్మా గాంధీ స్పూర్తి ని మరొక్కసారి గుర్తు చేయడమే లక్ష్యంగా నిర్మించినట్లు నిర్మాత, దర్శకుడు రామ్ అల్లాడి వివరించారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES