HomeTelugu'పుష్ప' సెన్సార్ పూర్తి.. U/A సర్టిఫికెట్.. డిసెంబర్ 17న విడుదల..

‘పుష్ప’ సెన్సార్ పూర్తి.. U/A సర్టిఫికెట్.. డిసెంబర్ 17న విడుదల..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సంచలన దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్టు పుష్ప. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకుU/A సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక్క ఫోటో, పోస్టర్, టీజర్, ట్రైలర్ అని అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కేవలం తెలుగులో మాత్రమే కాదు మిగిలిన భాషల్లో కూడా పుష్ప సినిమా కంటెంట్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.
వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూ ట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ అందుకుంటుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్.. సుకుమార్ దర్శకత్వం ప్రతిభ పుష్ప సినిమా స్థాయిని పెంచేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 12న హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో జరగనున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. MAASive Pre Release Event అంటూ పోస్టర్ కూడా విడుదల చేశారు. అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా పుష్ప ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ అందరూ ఈవెంట్ లో పాలు పంచుకుంటారు. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. రెండు భాగాలుగా పుష్ప సినిమా రానుంది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

నటీనటలు:
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు

టెక్నికల్ టీం:
దర్శకుడు: సుకుమార్
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా
సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే
సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ R
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్
లిరిసిస్ట్: చంద్రబోస్
క్యాస్ట్యూమ్ డిజైన్: దీపాలీ నూర్
మేకప్: నాని భారతి
CEO: చెర్రీ
కో డైరెక్టర్: విష్ణు
లైన్ ప్రొడ్యూసర్: KVV బాల సుబ్రమణ్యం
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ ముత్తంశెట్టి మీడియా

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES