బ్యానర్ : శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్
సినిమా : “పురుషోత్తముడు
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 26.07.2024
నిర్మాతలు – డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్
రచన -దర్శకత్వం : రామ్ భీమన
నటీనటులు – రాజ్ తరుణ్, హాసినీ సుధీర్, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, విరాన్ ముత్తంశెట్టి, ముకేష్ ఖన్నా, ప్రవీణ్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, సత్య తదితరులు
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “పురుషోత్తముడు”. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవు తున్నారు. “ఆకతాయి”, “హమ్ తుమ్” చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి
కథ.
పరశురామయ్య ఎంటర్‌ప్రైజెస్ అనే కంపెనీకి CEO గా ఉన్న రఘురామ్ (మురళీశర్మ). లండన్‌లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వస్తున్న తన కొడుకు రచిత రామ్ (రాజ్ తరుణ్) ను ఈ కంపెనీకి CEOని చేయాలని అనుకుంటాడు. అయితే కంపెనీ బైలాస్ ప్రకారం.. సీఈవో అవ్వాల్సిన వ్యక్తి 100 రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లిపోయి, తమ పలుకుబడి ఎక్కడా వాడకుండా సామాన్య జీవితం గడపాలి. వంద రోజుల పాటు తమకు సంబంధించిన వివరాలు గురించి ఎక్కడ ఎవరికీ చెప్పకూడదు. లేదు అంటే వారికి సీఈఓ అయ్యే అర్హత ఉండదు అనే విషయాన్ని తెరపైకి తీసుకొస్తుంది వసుంధర(రమ్యకృష్ణ). రచిత్ రామ్ కనుక ఆ షరతును ఉల్లంఘిస్తే తన కొడుకు అభయ్ రామ్ (విరాన్ ముత్తంశెట్టి) సీఈఓ అవుతాడు అనేది ఆమె అత్యాశ. ఈ క్రమంలో రామ్ కట్టుబట్టలతో అజ్ఞాతంలోకి వెళ్లకళ్ల తప్పదు. రాజమండ్రి దగ్గరలోని కడియపులంక అనే గ్రామానికి చేరుతాడు. ఆ గ్రామంలో పూలతోటలు నడుపుతున్న అమ్ములు (హాసిని సుధీర్) దగ్గరగ్గ పనిలో చేరతాడు. ఆ గ్రామంలోని రైతుల్ని స్థానిక ఎమ్మెల్యే, అతని కుమారుడు ఇబ్బందులకు గురి చేస్తారు. దీంతో వారు రామ్ సాయం కోరతారు. మరోవైపు రామ్ వివరాలను బయటకు తెలియజేసి తను సీఈవో కాకుండా అడ్డుకోవాలని పెద్దమ్మ, ఆమె కుమారుడు (విరాన్ ముత్తం శెట్టి)ట్టికుట్ర పన్నుతారు. తమ మనుషులతో అతడి ఆచూకీ కోసం గాలిస్తుంటారు. మరి రామ్ సీఈవో అయ్యాడా? ఆ రైతుల కోసం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే
రామ్ పాత్రలో నటించిన రాజ్ తరుణ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. గ్లామర్ ఆండ్ యాక్టింగ్‌లో గతం కంటే కాస్త ఇంఫ్రూవ్ అయ్యాడు. అమ్ములు పాత్రలో నటించిన హీరోయిన్ హాసిని సుధీర్ తెలుగుదనం ఉట్టిపడే అమ్మాయిగా తన పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా తనకిచ్చిన రోల్ పర్పెక్ట్ గా చేసింది. రాజ్ తరుణ్ కు జోడీగా ఆమె బాగా కుదిరింది. సీనియర్ నటి రమ్యకృష్ణ తన పాత్రకు నిండుతనం తెచ్చారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, విరాన్ ముత్తంశెట్టి, ముకేష్ ఖన్నా, ప్రవీణ్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, సత్య తదితరులందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పచ్చు. దర్శకుడు రామ్ భీమన గతంలో ఆకతాయి, హమ్ తుమ్ వంటి రెండు సినిమాలు చేశాక ఆరేళ్ల గ్యాప్ తర్వాత తీసిన “పురుషోత్తముడు” సినిమాను క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందించాడు. ఒక కోటీశ్వరుడైన అబ్బాయి పల్లెటూరికి ఎందుకు వచ్చాడు అక్కడ ఏం చేశాడు అనేటటువంటి కథతో ఇంతకుముందు తెలుగులో వచ్చినా కూడా ఈ సినిమా కథను తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు.ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాని ఒక కొత్త పాయింట్ ను టచ్ చేసి దర్శకుడుగా రామ్ భీమన సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు.ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, ముఖేష్ ఖన్నా, మురళీ శర్మ లాంటి పెద్ద ఆర్టిస్టులందరూ తమ నటనతో కథకు బలాన్ని తీసుకొచ్చారని చెప్పవచ్చు.
సాంకేతిక నిపుణుల పనితీరు;దర్శకుడు రామ్ భీమన గతంలో ఆకతాయి, హమ్ తుమ్ వంటి రెండు సినిమాలు చేశాక ఆరేళ్ల గ్యాప్ తర్వాత తీసిన “పురుషోత్తముడు” సినిమాను క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందించాడు. ఒక కోటీశ్వరుడైన అబ్బాయి పల్లెటూరికి ఎందుకు వచ్చాడు అక్కడ ఏం చేశాడు అనేటటువంటి కథతో ఇంతకుముందు తెలుగులో వచ్చినా కూడా ఈ సినిమా కథను తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు.ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాని ఒక కొత్త పాయింట్ ను టచ్ చేసి దర్శకుడుగా రామ్ భీమన సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు.ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, ముఖేష్ ఖన్నా, మురళీ శర్మ లాంటి పెద్ద ఆర్టిస్టులందరూ తమ నటనతో కథకు బలాన్ని తీసుకొచ్చారని చెప్పవచ్చు. గోపీసుందర్ మ్యూజిక్, పాటలు బాగున్నాయి. పీజీ విందా సినిమాటోగ్రఫీ ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది. చంద్రబోస్, చైతన్య ప్రసాద్, రామజోగయ్య శాస్త్రి వంటి వారి సాహిత్యం మా సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇందులో చాలా మందికి స్ఫూర్తిగా నిలిచే సీన్లు, మాటలు ఉన్నాయి. మార్తాండ్ కె వెంకటేష్, ఎడిటింగ్ పనితీరు బాగుంది