సైకో టీజర్ అదిరిపోయింది : ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్

706

కార్తీక్ సాయి, డాలీషా, నేహా దేశ్ పాండే హీరో హీరోయిన్లుగా చిన్నా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”సైకో”. శ్రీమతి లావణ్య సమర్పణలో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ఆవుల రాజు, సంకినేని వాసుదేవ రావు నిర్మిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ట్రైలర్ లాంచ్ వేడుక మంగళవారం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అథితిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ టీజర్ ను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో అల్లుడు అదుర్స్ సినిమా నిర్మాతలు గొర్రెల సుబ్రమణ్యం, గంజి రమేష్, సురేష్ కొండేటి లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

అకొంనంతరం నిర్మాత బెల్లండ సురేష్ మాట్లాడుతూ .. ఈ సినిమాతో మా కార్తీక్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ ఇలాంటి ఫీలింగ్ క్రియేట్ చేయగలిగితే తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఏదైనా కొత్తగా చేయాలన్న తపన ఉన్నట్టు కనిపిస్తుంది. కొత్తగా ఉంటేనే ఎవరైనా అంగీకరిస్తారు. ఈ కరోనా సమయంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక ఇంత గ్రాండ్ గా చేయడం నిజంగా గొప్ప విషయం. ట్రైలర్ చాలా రిచ్ గా క్వాలిటీగా ఉంది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అయి, నిర్మాతలకు బాగా డబ్బులు రావాలి, హీరోగా కార్తీక్ కూడా మరిన్ని సీనిమాలు చేయాలనీ కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత గొర్రెల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ .. ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. మా బెల్లంకొండ సాయి చేసిన రాక్షసుడు సినిమా గుర్తొచ్చింది. అంత బాగా ఉంది ట్రైలర్. తప్పకుండా ఈ సినిమా తీసిన దర్శకుడు చిన్న కు మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

సినిమా నిర్మాత అవుల రాజు మాట్లాడుతూ .. ఈ సినిమా విషయంలో ఏంతో కష్టపడి, తపన పడి చేసాడు మా అబ్బాయి కార్తీక్. అతని కష్టం చూసి నాకు అప్పుడప్పుడు బాధేసింది. కానీ ఈ సినిమా ట్రైలర్ చూసాకా ఆ కష్టం మరచిపోయేలా చేసింది. తప్పకుండా మీరంతా మా సినిమాను, మా అబ్బాయిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన వాసుదేవ రావు కు కూడా థాంక్స్ చెబుతున్నాను అన్నారు.

మరో నిర్మాత వాసుదేవ్ రావు మాట్లాడుతూ .. మా చిన్న చెప్పిన కథ విని చాలా ఎగ్జైట్ అయ్యాను. దాన్ని అంతకంటే బాగా తెరపైకి తెచ్చాడు. ఈ సినిమా కోసం తాను ఎంతగా కష్టపడ్డాడో మాకు తెలుసు. అతని కష్టం చూసి చాలా బాదపడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ టీజర్ తో అదంతా మరచిపోయేలా చేసింది. అలాగే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా విషయంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ సినిమాతో మా కార్తీక్ సూపర్ హిట్ కొట్టడం మాత్రం పక్కా., తప్పకుండా ఈ సినిమాను చూసి పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

హీరోయిన్ డాలీషా మాట్లాడుతూ .. ఈ సినిమాలో చేయడం నిజంగా చాలా హ్యాపీ గా ఉంది. కార్తీక్ ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకున్నాడు. ఎంతగా కష్టపడ్డాడో మాకు తెలుసు. తాను హీరోగా సూపర్ యాక్షన్ విషయంలో చాలా యాక్టీవ్ గా ఉంటాడు.. కానీ రొమాన్స్ విషయంలో చాలా డల్ గా ఉంటారు. ఆ ఒక్క విషయం తప్ప హీరోగా అతను సూపర్. తప్పకుండా ఈ సినిమాను చూసి అందరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

మరో హీరోయిన్ నేహా దేశ్ పాండే మాట్లాడుతూ .. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన కార్తీక్ కు నిర్మాతలకు థాంక్స్ , ఇందులో చాలా మంచి పాత్ర చేశాను. తప్పకుండా ఈ పాత్ర నాకు మంచి గుర్తింపు ఇస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ .. ఈ టీమ్ అందరితో కరోనా సమయంలో ట్రావెల్ చేశాను. నాకు సాయి గారు ఎప్పటినుండో నాతొ ట్రావెల్ అవుతున్నారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద సినిమా అవుతుంది. ఈ టీం వర్క్ డేడికేట్ గురించి నాకు తెలుసు. సతీష్ అన్ని దగ్గరుండి చూసుకున్నారు. ఈ టీం అందరికి ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఇండస్ట్రీ అదృష్టం ఉంది .. సోలో బ్రతుకే సినిమా నిరూపించింది.. క్రాక్ సినిమా మరింత ధైర్యాన్ని ఇచ్చింది. అదే కోవలో ఈ సినిమా కూడా పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో, దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ ..ఈ వేడుకకు ముఖ్య అథితిగా వచ్చిన బెల్లంకొండ సురేష్ గారికి నా ధన్యవాదాలు. ఈ సినిమా విషయంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, ముఖ్యంగా మా అమ్మ, నాన్నలకు, అలాగే వాసుదేవ్ గారికి. అయన నాకెంతో సపోర్ట్ చేసారు. ఇక ఈ సినిమా కోసం అందరిని కష్టపెట్టాను. వాళ్లకు నేను సారీ చెబుతున్నాను. నేను ఏది చేసిన నాకు ఇది ఎందుకు అని అనలేదు.. సపోర్ట్ చేసారు. నేను కచ్చితంగా చెబుతున్నాను.. ఈ సినిమా పక్కా సూపర్ హిట్ కొడుతున్నాం. ఈ సినిమా కోసం వాసు, సిద్దార్థ్, నాని, సంతోష్, నా డైరెక్టన్ డిపార్ట్మెంట్ ఇలా అందరు నాకు ఫుల్ సపోర్ట్ చేసారు. నాకంటే ఎక్కువ కేర్ తీసుకున్నది వాళ్లే. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన సురేష్ కొండేటి అన్నకు స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను. అలాగే హీరోయిన్స్ కూడా చాలా బాగా చేసారు. తప్పకుండా ఈ టీజర్ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. త్వరలోనే ఈ సినిమా విడుదల చేస్తాం అన్నారు.