‘అంతే..! అలా జరిగిపోయింది’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన ప్రొడ్యూసర్స్ కౌనిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్

36

విజయ్ శంకర్, సావిత్రి కృష్ణ హీరో హీరోయిన్లుగా వినాయక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద కంచర్ల సత్యనారాయణ రెడ్డి (కేఎస్ఆర్), సముద్రాల మహేష్ గౌడ్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘అంతే..! అలా జరిగిపోయింది’. ఈ చిత్రానికి శ్రీరామ్ అమృతపురి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రొడ్యూసర్స్ కౌనిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన అనంతరం ప్రొడ్యూసర్స్ కౌనిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘టైటిల్ ఎంతో క్యాచీగా ఉంది. యూత్‌కు నచ్చేలా, కనెక్ట్ అయ్యేలా టైటిల్ ఉంది. అంతే.. అలా జరిగిపోయింది.. ఏం జరిగింది? అనే ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ఈ మూవీని నిర్మాతలు కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్, దర్శకుడు శ్రీరామ్ అమృతపురి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఈ చిత్రానికి జయసూర్య బొప్పెం సంగీతాన్ని, మురళీ మోహన్ కెమెరామెన్‌గా, ఎంఎన్ఆర్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర అప్డేట్స్‌ను ప్రకటించనున్నారు.

నటీనటులు : విజయ్ శంకర్, సావిత్రి కృష్ణ, కేఎస్ఆర్, నవీన్, రత్నశ్రీ, హారిక, సురేష్ కుమార్

సాంకేతిక బృందం
బ్యానర్ : వినాయక ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : కంచర్ల సత్యనారాయణ రెడ్డి (కేఎస్ఆర్), సముద్రాల మహేష్ గౌడ్
దర్శకత్వం : శ్రీరామ్ అమృతపురి
సంగీతం : జయసూర్య బొప్పెం
సినిమాటోగ్రఫీ : మురళీ మోహన్
ఎడిటింగ్ : ఎంఎన్ఆర్
ఫైట్స్ : బాజీ
కొరియోగ్రఫీ : సుధాకర్ ఆకుల