“తిమ్మరుసు” హిట్ తో జోరు మీదున్న ప్రియాంక జవాల్కర్

511

లేటెస్ట్ ఫిల్మ్ “తిమ్మరుసు” హిట్ తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ చేసిన లాయర్ అను క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. “తిమ్మరుసు” లో ప్రియాంక అందంగా కనిపిస్తూనే, కంప్లీట్ పర్మార్మెన్స్ ఇచ్చిందని ఆడియెన్స్ అంటున్నారు. ఈ సినిమాలో ప్రియాంక కాంట్రిబ్యూషన్ ను అటు ఫిల్మ్ యూనిట్ కూడా ప్రశంసిస్తోంది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకున్న ప్రియాంక.. “తిమ్మరుసు” హిట్ తో టాలీవుడ్ లో మరింత జోరు పెరిగేలా కనిపిస్తోంది. ఆగస్టు 6న ప్రియాంక జవాల్కర్ నటించిన మరో కొత్త సినిమా “ఎస్ఆర్ కళ్యాణమండపం” విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ష్యూర్ హిట్ అనే టాక్ ఇప్పటికే ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దీంతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఈ సుందరి దక్కించుకున్నట్లే.

“టాక్సీవాలా” మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ తెలుగు నాయిక…తొలి చిత్రంతోనే తన గ్లామర్, పర్మార్మెన్స్ తో గుర్తింపు తెచ్చుకుంది. టాలెంటెడ్ యాక్ట్రెస్ గా యంగ్ హీరోలకు, దర్శకులకు ఫస్ట్ ఛాయిస్ అయ్యింది. ప్రస్తుతం ఆమె బ్యాక్ టు బ్యాక్ మూవీ రిలీజ్ లతో ఆడియెన్స్ ముందుకు వస్తోంది. ఈ మధ్య సన్నబడిన ప్రియాంక జవాల్కర్ మరింత అందంగా, అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఇండస్ట్రీని ఆకర్షిస్తోంది. ఆమె నటించిన మరో కొత్త సినిమా “గమనం” కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

యాక్టింగ్ కు స్కోప్ ఉంటూ క్రేజీ ఫిల్మ్స్ తో కెరీర్ ప్లాన్ చేసుకుంటోంది ప్రియాంక జవాల్కర్. నాని, శర్వానంద్ లాంటి నెక్ట్ లెవెల్ హీరోలతో తను మూవీస్ చేస్తాననే కాన్ఫిడెన్స్ తో ఉందీ బ్యూటీ. అందంగా ఉండి హార్డ్ వర్కింగ్ చేసే టాలెంటెడ్ హీరోయిన్స్ ఎంతోమంది టాలీవుడ్ లో సక్సెస్ అయ్యారు. అలా చూస్తే ప్రియాంక జవాల్కర్ కు త్వరలోనే మరింత స్టార్ డమ్ వచ్చే అవకాశం ఉంది. అందులోనూ తెలుగు అమ్మాయి కాబట్టి మన ప్రేక్షకులకు ఈ హీరోయిన్ ఎప్పుడూ స్పెషలే.