ఆగష్టు 4 న విడుదల అవుతున్న “ప్రియమైన ప్రియ “

165

గోల్డెన్ గ్లోరి బ్యానర్ పై అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్ హీరోహీరోయిన్ లు గా A. J సుజిత్ దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ” ప్రియమైన ప్రియ. A J. సుజిత్, A బాబు నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 4న మన స్క్రీన్ మ్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా థియేటర్ లలో ఘనంగా రిలీజ్ అవుతుంది. తమిళ్ లో ప్రియముడన్ ప్రియ , తెలుగులో ప్రియమైన ప్రియ గా రూపోందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా సంగీతం అందించారు..ఈ సినిమా సంగీత దర్శకుడిగా శ్రీకాంత్‌ దేవాకు 100 వ చిత్రం కావడం విశేషం.. సి.హెచ్‌ సీతారామ్ యాదవ్ నిర్మాణ నిర్వాహణలో రూపోందిన ఈమూవీ కి U/A సెన్సార్ సర్టిఫికెట్ సోంతం చేసుకుంది..

దర్శకుడు A. J సుజిత్ మాట్లాడుతూ .. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపోందించిన “ప్రియమైన ప్రియ “చిత్రాన్ని ఆగష్ట్ 4 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము.. మంచి స్క్రీన్ ప్లే , హీరో హీరోయిన్స్ పర్పామెన్స్ , శ్రీకాంత్ దేవా సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని , మన స్క్రీన్ మ్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామని అన్నారు.. సినిమా నిర్మాణంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రూపోందించిన ఈ మూవీ ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని విజ్ఙప్తి చేశారు..

బ్యానర్ : గోల్డెన్ గ్లోరి బ్యానర్
హీరో ,హీరోయిన్ : అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్
దర్శకత్వం : A. J సుజిత్
నిర్మాతలు : A J. సుజిత్, A బాబు
సహ నిర్మాత : కె లక్ష్మీ కాంత్
సంగీతం : శ్రీకాంత్‌ దేవా
నిర్మాణ నిర్వాహణ : సి.హెచ్‌ సీతారామ్
డిఓపి : షా
ఎడిటర్ : కె.ఇత్రిస్
మాటలు : యస్ మోహన్ కుమార్
స్టంట్ : డేంజర్ మణి
డ్యాన్స్ : రవిదేవ్
ఆర్ట్ : N నందకుమార్
గానం : చెరువూరి విజయకుమార్ , శ్రేష్ఠా
పి.ఆర్ .ఓ : దయ్యాల అశోక్