రెబల్ స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” విక్ర‌మాదిత్య క్యారెక్టర్ టీజ‌ర్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనూహ్య‌ స్పంద‌న‌

298

చాలా సంవత్సరాల తర్వాత రెబ‌ల్‌స్టార్ ప్రభాస్ రొమాంటిక్ జానర్ లో చేస్తున్న సినిమా “రాధే శ్యామ్‌”. ఈ సినిమా లో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య గా ప్ర‌త్యేకమైన క్యారెక్ట‌రైజేష‌న్ లో కనిపించబోతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇది గొప్ప ప్రేమ‌క‌థ గా మెష‌న్ పోస్ట‌ర్ ద్వారా రివీల్ అయ్యింది. విక్ర‌మాదిత్య ఎలా వుండ‌బోతున్నాడు..? ఏం చేయ‌బోతున్నాడు?. విక్ర‌మాదిత్య ఎవ‌రు..? అనే ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానం గా రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా క్యారెక్ట‌ర్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్య గా కనిపించనున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇట‌లీ లో జ‌రిగే ప్రేమ‌క‌థ గా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు దర్శకుడు కె కె రాధాకృష్ణ కుమార్.

నువ్వు ఎవరో నాకు తెలుసు కానీ నీకు చెప్పను, ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ చావు దగ్గరి నుంచి నాకు అన్నీ తెలుసు కానీ నీకు ఏది చెప్పను, ఎందుకంటే అది చెప్పినా మీ ఆలోచనలకు అందదు. నా పేరు విక్రమాదిత్య నేను దేవుడిని కాదు కానీ నేను మీలో ఒకడిని కూడా కాదు” అంటూ ప్రభాస్ చెప్పే వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ విశేషంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న సినిమా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది.

ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో వెరీయేషన్ చూపించారు. ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ డార్లింగ్ ని సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేశారు. దీనికి జస్టిన్ ప్రభాకర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్ తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణ గా నిలిచింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణ గా పుజా హెగ్డే కనిపించనున్నారు. ఇప్పటి వరకు ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ ‘గ్లిమ్స్ ఆఫ్ రాధేశ్యామ్’ విడుద‌ల చేశారు. ఇప్పుడు ఈ విక్ర‌మాదిత్య టీజ‌ర్ తో “రాధే శ్యామ్” ఫ్లేవ‌ర్ టేస్ట్ చూపించారు.

నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్య శ్రీ, ప్రియదర్శి, సచిన్ ఖేడ్‌కర్, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్ తదితరులు

టెక్నికల్ టీమ్: కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్
సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు,
యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ.. నిక్ పావెల్‌,
డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ.. వైభ‌వి మ‌ర్చంట్‌,
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌..సౌండ్ ఇంజ‌నీర్‌.. ర‌సూల్ పూకుట్టి,
ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్
పిఆర్ఓ : ఏలూరు శ్రీను

Eluru Sreenu
P.R.O