HomeTelugu`పోయే ఏనుగు పో`మూవీ టైటిల్ లోగోను విడుద‌ల

`పోయే ఏనుగు పో`మూవీ టైటిల్ లోగోను విడుద‌ల

ఒక ఏనుగు కొంత మంది చిన్న పిల్లల మధ్య జరిగే అద్భుతమైన సన్నివేశాలతో రూపొందుతున్న చిత్రం `పోయే ఏనుగు పో. కెవి రెడ్డి దర్శకత్వంలో పికెఎన్ క్రియేషన్స్ పతాకంపై ఎం.రాజేంద్రన్ తెలుగు, తమిళం లో `పో యానైకుట్టియే పో` పేరుతో నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మంచి బాణీలు స‌మ‌కూరుస్తున్నారు. ఈ చిత్రం తెలుగు టైటిల్ లోగో, బేనర్ లోగోను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా..

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ – “పోయే ఏనుగు పో. టైటిల్ చాలా కొత్తగా ఉంది. దర్శకుడు కెవి రెడ్డి మంచి కథ, మాటలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు తమిళ భాషలలో విడుదల చేయడం మంచి విషయం. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

చిత్ర నిర్మాత ఎం.రాజేంద్రన్ మాట్లాడుతూ – ‘మా మూవీ టైటిల్ లోగో, బేనర్ లోగోను విడుదల చేసిన రాజ్ కందుకూరి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. ఏనుగు, చిన్న పిల్లల మధ్య జరిగే మంచి సన్నివేశాలతో మా దర్శకుడు కెవి రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మంచి కుటుంబ కథా చిత్రం. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే తెలుగు తమిళ భాషలో విడుదల చేస్తాం” అన్నారు.

సాంకేతిక నిపుణులు :
రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కెవి రెడ్డి,
నిర్మాత: ఎం.రాజేంద్రన్,
కథ: ఎస్. అరవింద్ కేశవన్,
సినిమాటోగ్రఫీ: అమర్. జి,
సంగీతం: భీమ్స్ సిసిరోలియో,
లిరిక్స్ : శ్రీ శ్రీరాజ్,
మాటలు: అవినాష్, రమేష్ రెడ్డి, కెవి రెడ్డి,
ప్రొడక్షన్ మేనేజర్ : మధు సిహెచ్,
పిఆర్ఓ: సాయి సతీష్.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES