పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ( సెప్టెంబర్ 2 ) సందర్బంగా కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ మాజీ హోమ్ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యతో పాటు ప్రముఖ నిర్మాత బన్నీ వాసు, నిర్మాత అడ్డాల చంటి, రత్నం, రాఘవేంద్ర రెడ్డి, గంగయ్య నాయుడు, విఠల్, ఎంవి రావ్, చందు జనార్దన్, నిర్మాత వానపల్లి బాబురావు, వడ్డీ సుబ్బారావు, దర్శకుడు రాజేంద్ర కుమార్, రణ్వీర్ సాయి చంద్, ప్రభాకర్, శ్రీనివాస్, చేరగడ్డ శ్రీనాథ్, కెవి రమణమూర్తి, పద్మజ లక్ష్మి, శ్యామ్, సత్యనారాయణ, సురేష్ కొండేటి, ముత్యాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. ..హరిరామ జోగయ్య చేగొండి హరిబాబుగా టాలీవుడ్ లో ప్రసిద్ధిచెందిన నిర్మాత. బాబు పిక్చర్స్ పతాకం పై దేవుళ్లు సినిమా నిర్మించారు . 1977-78లో ఫిల్మ్ అభివృద్ధి మండలి ఛైర్మన్ గా కూడా పనిచేశారు. ఇక ఈ వేదికపై ఎం ఎచ్ రావు కేక్ కట్ చేశారు. అనంతరం మాజీ మంత్రి హరిరామ జోగయ్య మాట్లాడుతూ .. కాపు సంక్షేమ సేవ ఏర్పడి సంవత్సర కాలం దాటింది, ఈ సంస్థ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు, ఏ రాజకీయ పార్టీతో కానీ, ఏ కులానికి గాని వ్యతిరేకం కాదు. కేవలం కాపు కులస్తుల సంక్షేమం కోరుతూ ముందుకు నడుస్తున్న సోషల్ ఆర్గనైజేషన్ మాత్రమే. అయితే ఈ సంస్థకంటూ రాజకీయ సిద్ధాంతం ఉంది. రాజకీయంగా ఎదుగుతున్న కాపు నాయకులూ ఎవరైనా, ఏ పార్టీ వారు అయినా వారిని బలపరచడం ద్వారా ప్రోత్సహించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం.
జనసేన పార్టీని స్థాపించి , ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ రాజ్యాధికారం దక్కించుకునే దిశగా కాపులతో కాపులతో పాటు బిసి లను, ఎస్సి లను, ఎస్టీలు, మైనార్టీ వర్గాలను కలుపుకుంటూ ప్రస్తుతం అంచెలంచెలుగా ఎదుగుతున్న వారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. మా పవన్ కళ్యాణ్ గారు. సెప్టెంబర్ 2న అయన పుట్టినరోజు సందర్బంగా వారికి కాపు సంగం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని బలపరచడంలో భాగంగా కాపు సంక్షేమ సేన సమర్పణలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మళ్ళినీడి తిరుమలరావు నిర్మాతగా, ప్రముఖ సినీ రచయితా రాజేంద్ర కుమార్ దర్శకత్వంలో మేము రూపొందించిన మేమె .. అనే లఘు చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నాం అన్నారు. ఈ వేడుకకు అథితిగా వచ్చిన బన్నీ వాసుకు ధన్యవాదాలు అన్నారు. ఈ సందర్బంగా మేమె అనే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.