వేస‌విలో విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతున్న ప‌తంగ్

111


ఇప్ప‌టి వ‌ర‌కు భార‌తీయ సినిమాలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్ష‌కులు చూసి వుంటారు. కాని తొలిసారిగా ప‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిష‌న్ సినిమాస్ ప‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి ద‌ర్శ‌కుడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు. మ‌రికొంత మంది నూత‌న న‌టీన‌టుల‌తో పాటు ప్ర‌ముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటోంది. వేస‌విలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుండి.. సంక్రాంతి ఫెస్టివల్‌ను పురస్కరించుకుని.. శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా మేకర్స్ న్యూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

సంక్రాంతి పండుగలో భాగమైన పతంగ్ సెలబ్రేషన్స్‌ని తెలియజేసేలా ఉన్న ఈ పోస్టర్‌లో ఇద్దరు హీరోలు పతంగులు ఎగరవేస్తూ.. పోటీపడుతున్నట్లుగా ఉంటే, హీరోయిన్ చక్కగా నవ్వుకుంటోంది. చూడగానే ఈ పోస్టర్ ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్ విడుదల సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సికింద్ర‌బాద్ బ‌స్తీ నేప‌థ్యంలో రూపొందుతోన్న యూత్‌ఫుల్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా ఇది. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎమోష‌న్ ఇలా అన్ని ఈ చిత్రంలో వుంటాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ప్ర‌తి స‌న్నివేశం ఎంతో సహ‌జంగా వుంటుంది అన్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివరాలను తెలియ‌జేస్తాం’’ అని తెలిపారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌: శ‌క్తి అర‌వింద్‌, సంగీతం: జొస్ జిమ్మి, ఎడిట‌ర్‌: చాణ‌క్య రెడ్డి, ప్రొడ‌క్ష‌న్ డిజైనర్: వెంక‌ట్ శాతావాహ‌న‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్: మేఘన శాతావాహ‌నMadhu PRO
9849162675