పరారి” మూవీ థియేట్రికల్ ట్రైలర్ విడుదల.. మార్చి 30 న గ్రాండ్ రిలీజ్

197

శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్ లో, గాలి ప్రత్యూష సమర్పణలో, యోగేశ్వర్ అతిధి జంటగా, సాయి శివాజీ దర్శకత్వంలో, జివివి గిరి నిర్మించిన చిత్రం పరారీ..ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్ కు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ చిత్రం మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా వచ్చిన కాంగ్రెస్ లీడర్ అంజన్ కుమార్ యాదవ్, సీనియర్ నటులు సుమన్, ప్రసన్న కుమార్ లు థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయగా , దర్శకులు చంద్ర మహేష్, నిర్మాత తుమ్మల పల్లి రామసత్య నారాయణ, ప్రతాని రామకృష్ణ గౌడ్ లు థియేట్రికల్ ప్రోమో ను విడుదల చేశారు.నటి కవిత సాంగ్ ప్రోమో ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్స్ సి. హెచ్ హనుమంత రావు, గాలి అనిల్ కుమార్, రవతు కనకయ్య, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొని చిత్ర హీరో యోగేశ్వర్ బర్త్ డే సెలెబ్రేషన్ గ్రాండ్ గా జరిపి కేక్ కట్ కట్ చేశారు అనంతరం కాంగ్రెస్ నాయకులు శ్రీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. గిరి గారి అబ్బాయి యోగేష్ హీరో బాగా నటించారు. గిరి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా.చాలా రిచ్ గా తీశారు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్ అన్నారు.

శ్రీ .వి.హనుమంతరావు మాట్లాడుతూ.. తెలుగుకు ఆస్కార్ అవార్డు వచ్చిన సమయంలోనాగార్జున యూనివర్సిటీలో ఆర్. జీ.వి మహిళలను కించ పరచే విధంగా మాట్లాడడం కరెక్ట్ గా లేదు. తను వెంటనే మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలి. చెప్పక పొతే తనను ఇండస్ట్రీ వారందరూ తనను బహిస్కరించి చంచల్ గుడా జైలుకు పంపాలి. ఈ సినిమాలో నటించిన హీరో కు నిర్మాతకు ఈ సినిమా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటులు సుమన్ మాట్లాడుతూ.. మన తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చేలా కృషి చేసిన RRR టీం కు కంగ్రాట్స్. ఇది మన తెలుగు వారందరూ గర్వించే రోజు.ఇలాగే మన తెలుగు వారు మంచి సినిమాలు తీసి మరిన్ని ఆస్కార్ తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిర్మాత గిరి నను హీరోగా పెట్టి సినిమా తీస్తాను అంటే వద్దని తన కొడుకును హీరోగా మలచి ఇంట్రడ్యూజ్ చేయడం జరిగింది. అంజి గారు మా సినిమాకు డి. ఓ. పి గా చేయడం చాలా హ్యాపీ.. మహిత్ లాంటి మంచి మ్యూజిక్ డైరెక్టర్ లభించారు. ఇలా అందరూ మంచి టెక్నిషియన్స్ లభించడంతో సినిమా చాలా బాగా వచ్చింది.హీరో యోగేష్ చాలా బాగా నటించాడు. ఒక వైపు చదువు, మరో వైపు షూటింగ్ ఇలా కాలీ లేకుండా ఈ సినిమా కొరకు చాలా కస్టపడ్డాడు. .ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు మంచి సినిమా చూశాము అనే ఫీల్ కలిగేలా కలుగుతుంది. ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

నటి కవిత మాట్లాడుతూ.. ఈ సినిమా పాటలు చాలా బాగున్నాయి. ఇందులో హీరో చాలా చక్కటి నటనను ప్రదర్శించాడు. తను ఐ ఏఎస్ కు ప్రిపేర్ అవుతూ నటించడం చాలా గ్రేట్. మంచి కథతో ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పరారి చిత్రం చిత్ర యూనిట్ అందరికీ గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత జి వి వి గిరి మాట్లాడుతూ: మా కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. చక్రి తమ్ముడు మహిత్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నేను సుమన్ గారి అభిమానిని. ఆయన ఈ మూవీ లో సుమన్ మంచి క్యారెక్టర్ చేశారు. ఈ సినిమా బాగా వచ్చింది.ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా మంచి కథ కథనాలతో తెరకెక్కిన పరారీ అందరిని మెప్పిస్తుందని అన్నారు.

సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ..
హీరో యోగేష్ కు జన్మదిన శుభాకాంక్షలు.తను ఇందులో బాగా నటించాడు.సుమన్ గారు మా సినిమాకు చాలా ఎఫెక్ట్ పెట్టి పని చేశారు. ఇందులో సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఈ సినిమా నాకు మంచి పేరు వస్తుంది. నిర్మాత గిరి గారు ఎక్కడ ఖర్చుకు వెను కాడకుండా నిర్మించారు. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు థాంక్స్ అని అన్నారు.

డి. ఓ. పి గరుడ వేగ అంజి మాట్లాడుతూ.. గిరి గారు చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమాలో తన కొడుకు యోగీశ్వర్ చాలా బాగా నటించాడు. మహిత్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. దర్శకుడు మంచి టీం తో అనుకున్న టైంలో, బడ్జెట్ లో సినిమా పూర్తి చేశాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈసినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నిర్మాత గిరి గారు అబ్బాయి ఈ సినిమా తో హీరోగా పరిచయం అవుతున్నారు. తను ఇందులో బాగా నటించాడు.అల్ ది బెస్ట్ యోగిశ్వర్.ఈ సినిమా టీజర్ బాగుంది. మహిత్ సాంగ్స్ బాగున్నాయి. ఈ నెల 30 న వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి చిత్ర బృందానికి మంచి పేరు రావాలని అన్నారు

శ్రీ రౌతు కనకయ్య మాట్లాడుతూ.. మహిత్ గారు ఈ సినిమాకు మంచి సాంగ్స్ ఇచ్చాడు. సుమన్ గారు ఇందులో బాగా చేశాడు.చిత్ర యూనిట్ అందరికీ ఆల్ డ బెస్ట్ అన్నారు.

సుప్రీం కోర్డ్ రిటైడ్ జడ్జ్ శ్రీ మాల్యాద్రి మాట్లాడుతూ..మంచి భవిష్యత్తు ఉన్న యోగీశ్వర్ కు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

దర్శకులు చంద్ర మహేష్ మాట్లాడుతూ.. పరారి ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. హీరో కు ఇది మొదటి సినిమా అయినా చాలా బాగా నటించాడు.ఈ నెల 30 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

చిత్ర హీరో యోగిశ్వర్ మాట్లాడుతూ..సుమన్ సార్ తో నా మెదటి సినిమాలో నటిస్తానని అనుకోలేదు. మా డి. ఓ పి అంజి గారు నన్ను బాగా చూయించారు. మంచి కథ, మంచి కామెడీ, ఫైట్స్ తో వస్తున్న ఈ సినిమా చూసిన వారందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఇందులో నటించిన నటులు, టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

శ్రీ గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. మా కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. మా అన్న కుమారుడు యోగీశ్వర్ నటించిన ఈ సినిమా తర్వాత తను మరెన్నో సినిమాలో నటించి మంచి పేరు తెచ్చికోవాలని అన్నారు.

చిత్ర హీరోయిన్ గీతాంజలి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

నటీ నటులు
యోగిశ్వర్, అతిధి, సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు

సాంకేతిక నిపుణులు
నిర్మాత: జి వి వి గిరి,
దర్శకత్వం: సాయి శివాజీ
సంగీతం మహిత్ నారాయణ్,
లిరిక్ రైటర్స్: రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సినిమాటోగ్రఫీ; గరుడ వేగా అంజి,
ఎడిటర్ గౌతమ్ రాజు,
ఆర్ట్స్; ఆనంద్, కోటి అబలయ్,
యాక్షన్ :నందు,
కొరియోగ్రఫీ: జానీ, భాను,