*ప్రముఖ నటి మంచు లక్ష్మి విడుదల చేసిన మ్యూజిక్ ఆల్బమ్ “పాప చలో హైదరాబాద్”*

968

ఇండియా అబ్బాయి తను ప్రేమించిన అమెరికన్ అమ్మాయిని తన మాతృదేశానికి తీసుకు రావాలనే కొరికతో దేశం మారిపోతే లైఫ్ సరదాగా ఉంటుందని నచ్చజెపుతూ ఆ అమ్మాయికి ఇక్కడ ఉంటే బాగుంటుందని కన్విన్స్ చేసి తన మాతృదేశానికి తీసుకురావడానికి చేసిన చిన్న ప్రయత్నమే “పాప చలో హైదరాబాద్”..జెమినీ కన్సల్టింగ్ & సర్వీసెస్ పతాకంపై సింగర్ శ్రీకాంత్ సందుగు పాడిన “పాప చలో హైదరాబాద్” మ్యూజిక్ ఆల్బమ్ ను ఆనంద్ భట్ దర్శకత్వం వహించగా శ్రీని రజినీకాంత్ గంగవరవు నిర్మించారు .ఈ మ్యూజిక్ ఆల్బమ్ ను హైదరాబాద్ లో విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి మంచు లక్ష్మి, సంగీత దర్శకుడు ఆర్.పి పట్నాయక్, లక్ష్మీ దేవినేని , జెమినీ కన్సల్టింగ్ & సర్వీసెస్ చక్రవర్తి ,సింగర్ శ్రీకాంత్ సందుగు తల్లిదండ్రులు రంగాచారి, ఆండాళ్, కుటుంబ సభ్యులు శేషాచారి, శ్రీలత, కృష్ణ కళ, వేణు మాధవ్, శ్రీ వేద్, సింగర్ శ్రీకాంత్ సందుగు ఫ్రెండ్ ప్రవీణ్,అశ్విని, తదితరులు పాల్గొన్నారు..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన
ప్రముఖ నటి మంచు లక్ష్మి , సంగీత దర్శకుడు ఆర్.పి పట్నాయక్ చేతుల మీదుగా “పాప చలో హైదరాబాద్” మ్యూజిక్ ఆల్బమ్ ను విడుదల చేశారు. అలాగే ఆర్.పి పట్నాయక్ రాసిన “అమ్మ పాట” ప్రోమోను విడుదల చేశారు. ఈ పూర్తి పాటను అమ్మలకు డెడికెట్ చేస్తూ మదర్స్ డే సందర్భంగా మే 9న విడుదల చేస్తారు.అనంతరం

*ప్రముఖ నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ...* నా కెరియర్ కూడా యు.యస్ నుండే స్టార్ట్ అయింది. అయితే మనం యు.యస్ లో ఉండి ఎంత పేరు సంపాదించుకున్నా.. మన మాతృదేశంలో మన పాటను, మన ఫోటోను బిగ్ స్క్రీన్ పై చూసుకొంటే ఆ కిక్కే వేరు. తను నటిస్తూ పాడిన ఈ ఆల్బమ్ శ్రీకాంత్ కు ఏంతో మంచి పేరు తెచ్చిపెట్టాలి. తను ఇంకా ఎన్నో పాటలను ఇక్కడ ఆడియన్స్ కు పరిచయం చేయాలని అశిస్తున్నాను. అమెరికాలో వుండే ఎంతో మంది శ్రీకాంత్ లా ఇన్స్పైర్ అయ్యి ఇండియాలో తమ ప్రతిభ ను నిరూపించుకోవాలని అన్నారు.

*సంగీత దర్శకుడు ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ..* ఆమెరికాలో జరిగే నా షోస్ లలో శ్రీకాంత్ టీం తప్పక ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే వీరు చేసే ప్రతిదీ కొత్తగా ఉండాలని కొరుకుంటుంటారు.శ్రీకాంత్ అమెరికాలో ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. ఈ రోజు వారు నటిస్తూ పాడిన ఆల్బమ్ ఇండియాలో విడుదల అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అమెరికా వారు పాడిన ఆల్బమ్స్ ఎంతటి విజయం సాదించాయో ఈ రోజు ఇండియాలో విడుదల చేస్తున్న ఈ ఆల్బమ్ కూడా అంతే పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
లైఫ్ ఎప్పుడు అమ్మతో మొదలవుతుంది. అలాగే నా సెకెండ్ ఇన్నింగ్స్ కూడా “అమ్మ పాట” తో మొదలవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. త్వరలో నేను కమిట్ అయిన సినిమా విషయాలు త్వరలో తెలియ జేస్తాను అని అన్నారు.

*సింగర్ శ్రీకాంత్ తల్లిదండ్రులు మాట్లాడుతూ..* మా అబ్బాయిక్ చ్చిన్నప్పటి నుండి పాటలంటే ఏంతో ఇష్టం .ఈ రోజు ఇంత స్టేజ్ కు ఎదిగినందుకు చాలా ఆనందంగా ఉంది. పుత్రోత్సాహము పుత్రుడు జన్మించి నపుడే అనే పద్యం పద్యం చిన్నపుడు తనకు నేర్పాము. అది ఈ రోజు నిజమైనందుకు మాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

*సింగర్ శ్రీకాంత్ సందుగు మాట్లాడుతూ…* చిన్నప్పటి నుండి మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం.మా కాలేజ్ లో జరిగే ప్రతి ఈవెంట్ లో పాటలు పాడే వాణ్ణి. కానీ నాకు అప్పుడు ఇది ప్రొఫెషన్ గా తీసుకోవాలని ఆరోజు అనుకోలేదు. తరువాత 2004 లో చుదువు రిత్యా అమెరికా వెళ్లడం జరిగింది. అమెరికాలో జరిగిన “పాడుతా తీయగా” మొదటి ఎపిసోడ్ లో సింగర్ గా పాడాను.ఆ పాటకు నాకు చాలా ప్రశంసలు వచ్చాయి. సంగీత విద్వాంసుడు బాలు గారు కూడా నన్ను అప్రిసియేట్ చేయడం జీవితంలో మరచిపోలేను. అలా వారు ప్రశంశించి చెప్పిన మాటలకు మోటివేట్ అయ్యాను. అప్పటినుండి నేను సింగర్ కావాలనే ప్యాసినెట్ తో వర్క్ చేశాను. యు.యస్ లో ఇప్పటి వరకు 450 ప్రోగ్రామ్స్ చేశాను.అక్కడ వుండే ప్రతి అసోసియేషన్ కు,ఆర్గనైజేషన్ కు పాడడం జరిగింది.మ్యూజిక్ అంటే నాకు ఏంతో ఇష్టం నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలా చూసుకునేవాన్ని..ఇకనుండి నేను సింగర్ గా పాడిన పాటలు పాట రూపకంగా కాక విజువల్ గా కూడా నేను ప్రేక్షకులకు కనపడాలని కోరికతో ఆర్టిస్ట్ గా చేసి ప్రపంచంలో వుండే తెలుగు వారందరికీ దగ్గరవ్వాలనే కోరికతో.. అమెరికాలోని చికాగో లో హైదరాబాద్ సిటీ గురించి పాడిన “పాప చలో హైదరాబాద్” మ్యూజిక్ ఆల్బమ్ ను నేను పుట్టి పెరిగిన, హైదరాబాద్ లో విడుదల చేస్తే బాగుంటుందని ప్రముఖ నటి మంచు లక్ష్మి, , సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ లను కలవడం జరిగింది.కోవిడ్ టైంలో కూడా వారు నన్ను, నా పాటను బ్లెస్స్ చేయడానికి వచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు. సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ లో వుంటూ యాంకరింగ్ ను ప్రొఫెషన్ గా తీసుకొని అమెరికాలో ఎన్నో పెద్ద, పెద్ద కన్వెన్షన్, అసోసియేషన్స్ లకు హోస్టింగ్ చేసిన ప్యాసినెట్ యాంకర్ సాహిత్య ఈ మ్యూజిక్ ఆల్బమ్ కు ప్రొడక్షన్ ఇంచార్జ్ గా ఉంటూ.. ఈ ఆల్బమ్ బాగా రావాలని తను ఏంతో డెడికెట్ గా వర్క్ చేయడమే కాక ఈ ఈవెంట్ కు తనే ఆర్గనైజ్ చేసి మా ఈవెంట్ సక్సెస్స్ చేసింది. ఆర్.పి పట్నాయక్ రాసిన అమ్మ పాటలో సాహిత్య లీడ్ రోల్ లో నటించింది. ఈ పాటతో తనకు మంచి పేరుతో పాటు,మంచి నటిగా గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.అలాగే నా ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు సమక్షంలో ఈ ఆల్బమ్ లాంచ్ ఈవెంట్ జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

*జెమినీ కన్సల్టింగ్ & సర్వీసెస్ చక్రవర్తి మాట్లాడుతూ..* ఇది మా ఫస్ట్ ప్రాజెక్టు ఇలాంటి మంచి పాటతో మేము మీ ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.ఈ సాంగ్ మంచి విజయం సాధించాలి త్వరలో బాలకృష్ణ గారి ఆశీస్సు లతో జెమిని ఎంటర్ టైన్మెంట్ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తాం అని అన్నారు.

*మాధవ పెద్ది సురేష్ మాట్లాడుతూ…* అమెరికాలో వీరు నాకు ఒక ఈవెంట్ చెసినప్పుడు వీరికి మంచి భవిష్యత్తు ఉందని అనుకున్నాను. అనుకున్నట్లే వారు అమెరికాలో ఎన్నో ఆల్బమ్స్ విడుదల చేసి అక్కడ సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ రోజు ఇండియాలో కూడా తన పాటల ఆల్బమ్ లాంచ్ ఈవెంట్ కు నన్ను ఇన్వైట్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది.తనకు ఈ ఆల్బమ్ పెద్ద విజయం సాధించాలి అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ శ్రీకాంత్ సందుగు కుటుంబ సభ్యులు, మరియు ఫ్రెండ్స్ అందరూ ఈ ఆల్బమ్ పెద్ద విజయం సాధించాలని కోరుకొంటున్నామని అన్నారు.

*తారాగణం:*
శ్రీకాంత్ సందుగు, లోరీనా తదితరులు

*సాంకేతిక నిపుణులు*
ఆల్బమ్ పేరు : “పాప చలో హైదరాబాద్”
దర్శకుడు: ఆనంద్ భట్
నిర్మాత : శ్రీని రజినీకాంత్ గంగవరవు
సంగీతం: అభినయ్ టి.జె
ప్రొడక్షన్ మేనేజర్: సాహిత్య వింజమూరి
పి.ఆర్.ఓ :- సాయి సతీష్ – రాంబాబు పర్వతనేని

Regards,
P.Rambabu
9848 123 007