ఇరవైఏళ్ళ క్రితం “దేవుడు వరమందిస్తే… నిన్నే కోరుకుంటాలే!” అనే గీతం అప్పటి యూత్ ని విశేషంగా ఆకట్టుకుని సంచలనం సృటించింది. మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ స్వరపరిచిన ఆ పాట సిక్స్ టీన్స్ చిత్రంలోనిది. అయితే సిక్స్ టీన్స్ సీక్వెల్ గా ప్రస్తుతం ఘంటాడి కృష్ణ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఇతివృత్తం తో పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘రిస్క్’ అనే మూవీ నిర్మించారు. ఈ చిత్రానికి సంబందించిన సిద్ శ్రీరామ్ పాడిన ఫస్ట్ సింగల్ ప్రోమో ఉగాది పర్వదినం సందర్భంగా ఈ రోజు జనవరి 22న బుధవారం సాయంత్రం 04:05 గంటలకు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల చేసారు.
నిర్మాత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ…”ఇప్పటివరకు 62 సినిమాలకు సంగీతం అందించిన నేను నా సొంత బ్యానర్ జి కె మిరకిల్స్ లో అందిస్తున్న చిత్రం ‘రిస్క్’. ఇరవైఏళ్ళ క్రితం “దేవుడు వరమందిస్తే… నిన్నే కోరుకుంటాలే!” పాట తెలుగు ప్రేక్షకులకు నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేసింది. ఆ పాట సక్సెస్ ఫుల్ మూవీ ‘సిక్స్ టీన్స్’ చిత్రంలోనిది. అయితే మళ్ళీ అలాంటి నలుగురు కుర్రాళ్ళ కథ తో ఈ సారి ఓ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘రిస్క్’ అనే చిత్రాన్ని నేటి యూత్ కి నచ్చేవిధంగా స్వీయ దర్శకత్వం లో నిర్మించాను. ఈ చిత్రంలో 8 పాటలు, ఒక బిట్ సాంగ్ ఉంటుంది. ఈ రోజు సిద్ శ్రీ రామ్ ఆలపించిన “సొగసుకే సోకు” లిరికల్ సాంగ్ ప్రోమో విడుదల చేసాం. ఈ నెల 24వ తేదీన సాయంత్రం తెలుగు పాట తో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో కూడా మెయిన్ సాంగ్ ఈ నెల 24వ తేదీన సాయంత్రం సినీ ప్రముఖుల తో విడుదల చేస్తున్నాం ” అన్నారు.
తారగణం : సందీప్ అశ్వా, సానియా ఠాకూర్, జోయా ఝవేరి, తరుణ్ సాగర్, అర్జున్ ఠాకూర్ , విశ్వేష్, అనీష్ కురువిళ్ళ, రాజీవ్ కనకాల, కాదంబరి కిరణ్, దువ్వాసి మోహన్, టార్జాన్, టి ఎన్ ఆర్, జబర్దస్త్ టీం– అప్పారావు, రాజమౌళి,రాము తదితరులు నటించారు.
టెక్నికల్ టీం :
బ్యానర్: జి కె మిరకిల్స్
డైరెక్టర్: ఘంటాడి కృష్ణ,
మ్యూజిక్ డైరెక్టర్ : ఘంటాడి కృష్ణ (జి కె)
డీవోపీ: జగదీశ్ కొమరి
ఎడిటర్: శివ శార్వాణి
ఫైట్స్: శంకర్ మాస్టర్
కో – డైరెక్టర్ : బన్సీ కోయల్కర్
ఆర్ట్: మురళి,
ప్రొడక్షన్ డిజైనర్ : రాహుల్,
కోరీయోగ్రాఫర్స్ : రఘు అజయ్ సాయి, వెంకట్ డీప్, అజ్జు, మెహర్,
రైటర్స్ క్రివ్ : శివ, నవీన్, నరేన్,
స్టూడియోస్ రిథమ్, అమూల్య, షేడ్స్,
కో – ఆర్డినేటర్ : రాంబాబు వర్మ
పోస్టర్ డిజైనర్స్ : ధని ఏలే, కిషోర్, ఈశ్వర్
Telugu
https://youtu.be/uSkfOBFGtQY
Hindi
https://youtu.be/SG_jKRz1E3s
Tamil
https://youtu.be/xlyc-2cMldw
Kannada
https://youtu.be/P1EROKAncSA