HomeTelugu"పల్లె గూటికి పండగొచ్చింది" మోషన్ పోస్టర్ విడుదల

“పల్లె గూటికి పండగొచ్చింది” మోషన్ పోస్టర్ విడుదల

కే ప్రవీణ్ సమర్పణలో దివ్య తేజస్విని పతాకంపై రోహిత్ కృష్ణ సంతోష్ నిఖిత హర్షిత నటీనటులుగా తిరుమల్ రావు దర్శకత్వంలో కె లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం “పల్లె గూటికి పండగొచ్చింది”. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను   హైదరాబాదులోని ఫిల్మ్ ఛాంబర్ లోని పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు.అనంతరం జరిగిన  సమావేశంలో

చిత్ర దర్శకుడు తిరుమల్ రావు మాట్లాడుతూ . పల్లెల్లో ఉన్న యువత ఏ రకంగా చెడు మార్గం లో వెళుతున్నారు.వారి ప్రవర్తనను మంచి మార్గంలో చేసుకుంటే ప్రభుత్వ సహకారం లేకుండానే ఎలా స్మార్ట్ విలేజ్ చెయ్యచ్చు అనేదే చిత్ర కథాంశం. నిజంగా రాజకీయ నాయకుల సహకారం లేకుండా కూడా ఒక పల్లె ను ఏ రకంగా అభివృద్ధి పథంలో నడిపించవచ్చు అనే మెయిన్ పాయింట్ గా తీసుకొని మంచి కాస్టింగ్ తో చాలా బాగా చేశాము.పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.ఫిబ్రవరి లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను ఒక తల్లి కొడుకు,తండ్రి కూతురు  ఇలా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా..చూడదగ్గ సినిమా..ఈ సినిమా చాలా బాగా వచ్చింది.ఇందులోని క్లైమ్యాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. క్లైమాక్స్ చూసిన వారంతా షాక్ అవుతారు అలాగే  ఆస్వాదిస్తారు.ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని ఆన్నారు.

నిర్మాత లక్ష్మీ మాట్లాడుతూ..”పల్లె గూటికి పండగొచ్చింది”   సినిమాలో నేను యాక్ట్ చెయ్యలేదు కానీ.. మా అబ్బాయి హీరోగా యాక్ట్ చేశాడు.అందరూ ఒక ఆర్టిస్ట్ అబ్బాయి ఈజీ గా హీరో అవుతాడు అనుకుంటారు. కానీ తన స్వశక్తి తో నాకు తెలియకుండా దర్శకుడు తో స్క్రీన్ టెస్ట్ లో ఒకే చేయించుకొన్న తరువాతే తనకు మా అబ్బాయి అని తెలిసింది.దర్శకుడు దగ్గర కథ రెడీ చేసుకొన్న తరువాతే నాకు చెప్పడం జరిగింది..ఆ తరువాత సినిమా షూట్ పూర్తి అయ్యే వరకు కూడా నేను ఒక్క షార్ట్ కూడా చూడలేదు. సినిమా పూర్తి అయిన తరువాతే సినిమా చూడడం జరిగింది.తను నాకు ఎం చెప్పాడో దర్శకుడు అదే తీశాడు.ఈ కథను చాలా చక్కగా తీశాడు.ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా ఇది.ఈ సినిమా చూసిన తరువాత నాకు ఏమనిపించింది అంటే కొద్ది రోజులు పల్లెటూరులో వుండాలనిపించింది. పల్లెటూరిలోని యువతను మంచి దారిలోకి ఎలా తీసుకొచ్చారు. ఫారిన్ లో సెటిల్ అయిన వారిని పల్లె కు తీసుకొచ్చి మేము ఇక్కడే ఉంటాం ఇలాంటి మంచి వాతావరణాన్ని మేము మిస్సయ్యాము అనేటటువంటి బలమైన సీన్స్ ఇందులో ఉన్నాయి. సుమన్, సాయి కుమార్ ,శియాజి షిండే, రఘు బాబు, అన్నపూర్ణమ్మ లాంటి తదితర సీనియర్ నటులతో మా అబ్బాయి నటించడం వలన తను ఎంతో నేర్చుకున్నాడు. ఫిబ్రవరి లో వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.

హీరో రోహిత్ కృష్ణ మాట్లాడుతూ.. సీనియర్ నటులతో నటించే ఇంతమంచి అవకాశం కల్పించిన తిరుమల్ రావు కు ధన్యవాదాలు. టెక్నిసిషన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు.చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఇష్టం.నా జాబ్ మానేసి సత్యానంద్ గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను.ఆ తరువాత తిరుమల రావు తో కలసి మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను శ్రీకాకుళం లో 95% షూట్ చేశాము. తెలుగు భాష సంసారాం. పల్లెటూరి లైఫ్ ఎలా ఉంటుంది అని  డెప్ట్ గా ఈ సినిమా తీశాము. పల్లెటూరి నుంచి వచ్చిన వారికి ఈ సినిమా కచ్చితంగా కనెక్ట్ అవుతుంది.ఎవరైనా మా సినిమా చుస్తే వారికి వారి పాట జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.

నటీనటులు
రోహిత్ కృష్ణ, సంతోష్ ,నిఖిత, హర్షిత, సుమన్, సాయి కుమార్ ,శియాజి షిండే, రఘు బాబు, అన్నపూర్ణమ్మ, జబర్దస్త్ రాజమౌళి ,జబర్దస్త్ అప్పారావు ,రోలర్ రఘు, గుండు మురళి జగదీశ్వరి తదితరులు

సాంకేతిక నిపుణులు
ప్రజెంట్స్ :  కే ప్రవీణ్
బ్యానర్ : దివ్య తేజస్విని ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్ : కె లక్ష్మి
స్టోరీ డైరెక్షన్ స్క్రీన్ ప్లే : కె తిరుమల్ రావు
మ్యూజిక్ డైరెక్టర్ : సింధు కే ప్రసాద్
సినిమాటోగ్రఫీ : రవి టి
పోస్ట్ ప్రొడక్షన్ డిజి క్వెస్ట్

 

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES