సినిమా అనే మాట వినోదానికి పర్యాయపదంగా మారిన రోజుల్లో ఆ వినోదంతో పాటు సామాజిక స్పృహ కలిగిన సినిమాలను అందించే దర్శకులు అరుదుగా ఉంటారు. తెలుగు లో ఆ జాబితాలో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కరుణ కుమార్. పలాస1978సినిమా విడుదలయి మూడేళ్ళు కావొస్తున్నా
ఇప్పటికీ పలాస పేరు ఎక్కడో ఒక చోట వినపడుతూనే ఉంది. మేకర్స్ కి రిఫరెన్స్ సినిమాగా మారింది. భారతీయ సినిమా తెరమీద సామాజిక బాధ్యత గల సినిమాలతో తమదైన ముద్రను వేస్తున్న దర్శకులు నీరజ్ ఘావన్, నాగరాజ్ ముంజలే, వెట్రిమారన్, పా రంజిత్ సరసన తెలుగు నుండి కరుణ్ కుమార్ పేరు చేరింది.
దళిత పాలిటిక్స్ బేస్ చేసుకొని నిర్మించిన సినిమాలను ఎంపిక చేసి వానమ్ ఆర్ట్స్ ఫెస్టివల్ ని నీలమ్ ఆర్ట్స్ కల్చరల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు దర్శకులు పా రంజిత్. సామాజిక స్పృ హతో దళితులకు
రాజ్యాధికారం అనే అంశం ను ఇతి వృత్తంగా తీసుకొని సామాజిక చైతన్యం కలిగించిన సినిమా లు ఏ బాషలోనైనా అరుదుగా వస్తాయి. ఒక కథా వస్తువును తీసుకునేందుకు దర్శకుడు పడే తపన ఖఛ్చితంగా అతని వ్యక్తిత్వం లోంచి వస్తుంది. అందుకే పలాస 1978 రిలీజ్ అయి మూడేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ సినిమా ప్రపంచంలో చర్చా వస్తువుగానే ఉంది. టి.కృష్ణ, ఆర్. నారాయణ మూర్తి వంటి సామాజిక బాధ్యత తో సినిమాలు తీసే దర్శకులు తర్వాత తెలుగులో కరుణ కుమార్ పేరు ఆ వరసలో ముందుకు వస్తుంది. కథా రచయితగా నేషనల్ స్థాయి గౌరవం దక్కించుకున్న కరుణ కుమార్ అదే కథా బలంతో సినిమాలు చేస్తున్నారు.
చెన్నైలో ఈ నెల 9, 10,11 లలో p.k.rose ఫిల్మ్ ఫెస్టివల్ పేరిట జరగబోయే ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కాబోయే సినిమాలలో పలాస 1978 ఎంపిక అయ్యింది ఈ సందర్భంగా దర్శకులు కరుణ కుమార్ మాట్లాడుతూః దళిత జీవనాన్ని, దళిత జీవిత కథా చిత్రాన్ని కథా వస్తువులుగా తీసుకునే పా రంజిత్ 2018 లో వానమ్ ఆర్ట్ ఫెస్టివల్ ని ప్రారంభించారు. కరోనా తర్వాత మళ్ళీ ఈ ఫెస్టివల్ జరగబోతుంది. ఏప్రిల్ నెలను దళిత్ మంత్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్
మహాశయుని పుట్టిన రోజు పురస్కరించుకొని చేస్తున్న ఈ ఫెస్టివల్లో సాహిత్యం , సినిమా రెండు కూడా ప్రధాన భూమికలు పోషిస్తున్నాయి. దళిత పాలిటిక్స్ ని ఇతివృత్తంగా చేసుకొని చేసిన సినిమాలు ఈ ఫెస్టివల్లో ప్రదర్శిస్తారు. దేశం గర్వించే దర్శకుల సినిమా ల పక్కన పలాస 1978 సినిమా కు చోటు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఫెస్టివల్ లో భాగం అయినందుకు నాకు గర్వంగా కూడా ఉంది. ఒక మంచి ప్రయత్నం చేస్తే దాన్ని భుజాన వేసుకొనే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు అని పలాసతో నాకు అనుభవంలోకి వచ్చింది. దానితో పాటు ఇటువంటి వేదిక ల మీద పలాస 1978 సినిమా ప్రదర్శించడం దర్శకుడుగా మరిచిపోలేని అనుభవం కాబోతుంది.అన్నారు