బన్నీవాస్, డిస్టబ్యూటర్ గా తన కెరియర్ మొదలుపెట్టి 100% లవ్ సినిమాతో నిర్మాతగా మారి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేసారు. ప్రస్తుతం “పక్కా కమర్షియల్” సినిమా నిర్మిస్తున్న బన్నీ వాస్ తన పుట్టినరోజు సందర్బంగా మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
నేను ఎంత సంపాదించాను అని కాకుండా, ఆడియన్స్ ను థియేటర్ కి ఎంత దగ్గరగా ఉంచాం అనేది ఇంపార్టెంట్. అందుకే పక్కా కమర్షియల్ సినిమాని కూడా అందరికి అందుబాటులో ఉండే టికెట్ రేట్స్ పెట్టాం. కామన్ పీపుల్ , మిడిల్ క్లాస్ పీపుల్ సినిమాకి వచ్చే పాజిబిలిటే ఉన్నట్లే ప్లాన్ చేసాము.
2002 లో నేను ఇండస్ట్రీకి వచ్చాను, నిర్మాతగా 2011 లో నా మొదటి సినిమా చేసాను, దాదాపుగా ఈ పదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి రాముడు బుద్ధిమంతుడు అని చెప్తే ఇప్పుడు వినేవారు లేరు, రాముడు బెత్తం పడతాడు అని చెప్తే వినే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. థియేటర్ లో ఆడటం కోసం సినిమాను చేస్తే ఎక్స్ట్రార్డనరీ కంటెంట్ ఉండాలి, నార్మల్ ,ఆర్డినరీ కంటెంట్ తో సినిమా చేయలేము.
పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 18 పేజెస్ సినిమా జరుగుతుంది ఆ తరువాత చందు మొండేటి , పవన్ సాధినేని సినిమాలు ఉండబోతున్నాయి అని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.