‘ఒరేయ్‌ బుజ్జిగా..’ చిత్రం నుండి ‘కురిసెన.. కురిసెన..`సాంగ్ మేకింగ్ వీడియో విడుద‌ల‌

604

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా…`. ఉగాది కానుకగా మార్చి 25 విడుద‌ల‌వుతుంది. రీసెంట్‌గా ఈ చిత్రం నుండి అనూప్ రూబెన్స్ సంగీత సార‌థ్యంలో ప్ర‌ముఖ ప్లే బ్యాక్ సింగ‌ర్స్ అర్మాన్‌ మాలిక్‌, పి.మేఘన అద్భుతంగా ఆల‌పించిన ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున..మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ సాంగ్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నుండి అపూర్వ స్పంద‌న ల‌భిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఈ సాంగ్ మేకింగ్ వీడియోను విడుద‌ల‌చేసింది చిత్ర‌యూనిట్‌.

సందర్భంగా యంగ్ హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ – “‘ఒరేయ్‌బుజ్జిగా..`లో ఫ‌స్ట్ సాంగ్ కురిసెన‌..కురిసెన‌. అనూప్ రూబెన్స్ సంగీత సార‌థ్యంలో అర్మాన్‌ మాలిక్, పి.మేఘన అద్భుతంగా పాడారు. కె.కె గారు చాలా అందంగా లిరిక్స్ రాశారు. ఈ మ‌ధ్య కాలంలో వ‌న్ ఆఫ్ బెస్ట్ లోకేష‌న్స్‌లో చిత్రీకరించిన ల‌వ్‌లీ డ్యూయెట్ ఇది. క‌చ్చితంగా ఐ.ఆండ్రూ ఫోటోగ్రఫీ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్‌ అవుతుంది“ అన్నారు.