మహాశివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చ్ 8న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల

66

మహాశివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ ఘనంగా విడుదలవుతుంది. నిహార్ కపూర్, యాక్టర్ నాగార్జున, సత్య కృష్ణ, టి. ప్రసన్నకుమార్, రగ్ధా ఇఫ్తాకర్, సంజన, శాంతి తివారి, సోనియా, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి గారు నిర్మాతగా చదలవాడ శ్రీనివాసరావు గారు దర్శకునిగా ఈ సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమాకి కథ అంగిరెడ్డి శ్రీనివాస్ గారు అందించగా డిఓపిగా కంతేటి శంకర్ మరియు సాబు వర్గీస్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాకు వేసిన ప్రీమియర్ షోలకు మంచి స్పందన లభించగా ప్రేక్షకులు ముందుకు మార్చ్ 8 ని తీసుకురాబోతున్నారు.

ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ : ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి తయారు చేసిన మా సినిమా రికార్డ్ రేపు రిలీజ్ అవబోతోంది. ఇన్ని సినిమాలు చేసిన ఎప్పుడూ ఈ సినిమాను ప్రమోట్ చేయండి అని అడగలేదు కానీ ఈ రికార్డ్ బ్రేక్ సినిమా మీడియా ప్రేక్షకులు అందరూ ప్రమోట్ చేసే సక్సెస్ చేయాలి. ఇది ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. మార్నింగ్ షో ఓపెనింగ్స్ మంచిగా వస్తే ఈవినింగ్ కల్లా సినిమా కచ్చితంగా పుంజుకుంటుంది. మార్నింగ్ షో కి వచ్చి చూడండి సినిమా బాగోకపోతే ఎవరూ రావద్దు బాగుంటే మటుకు ఖచ్చితంగా సినిమా ని సపోర్ట్ చేయాలి అని నా విన్నపం. ఒక కథానాయకుడు కథానాయకి అనేదానికి ఈ సినిమా ద్వారా ఒక గొప్ప నిర్వచనం చెప్పబోతున్నాం. కథానాయకుడు కథానాయక అని కాకుండా ఒక మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఒక గొప్ప చిత్రం తీసానన్న గర్వంగా చెప్పగలను. ఇటువంటి సినిమాలను ఆదరిస్తే నాలాంటి ఎంతోమంది దర్శకులు ఇండస్ట్రీ కి వస్తారు. కొత్త డైరెక్టర్లకి కొత్త ఆర్టిస్టులకి ఎంతో మంది ఇండస్ట్రీకి రావడానికి ఒక పునాది లాంటి సినిమా ఇది. ఐదేళ్ల కష్టం నాతోపాటు ఉండి నాలో భాగమైన అజయ్ కో డైరెక్టర్ రాఘవ నాకు సహకరించిన నా ఆర్టిస్టులు టెక్నీషియన్ టీం మ్యూజిక్ డైరెక్టర్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. అంగిరెడ్డి శ్రీనివాస్ అందించిన కథ డిఓపిగా కంతేటి శంకర్ పనితీరు చాలా బాగున్నాయి. చలపతి రావు గారు ఈ సినిమాలో నటించడం సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించి పెద్ద సక్సెస్ చేయాలి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ : కరోనా కాలంలో పేస్టింగ్ బాయ్స్ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కష్టంలో ఉన్న అందరిని ఆదుకున్న వ్యక్తి చదలవాడ శ్రీనివాసరావు గారు. మనం ఎదుటివారికి సేవ చేస్తే దేవుడు మనకు పదింతలు ఇస్తాడు అని నమ్మి ఉండే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఈ రోజున ఈ రికార్డు బ్రేక్ సినిమా చేశారు. ఇందులో పెద్దపెద్ద ఆర్టిస్టులు ఎవరూ లేకపోయినా క్యారెక్టర్లు కనబడాలి అని నమ్మిన వ్యక్తి. ఒక మంచి సబ్జెక్ట్ ఎంచుకుని ఈ సినిమా తీశారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు అలాగే రైతుల గురించి అదేవిధంగా ప్రతి భారతీయుడు గర్వించే సినిమా ఇది. ఇద్దరు అనాధలు వరల్డ్ రెజ్లింగ్ వరకు ఎలా వెళ్లారు అనే కాన్సెప్ట్ చాలా బాగా చిత్రీకరించారు. ఈ సినిమా చేయడం చాలా రిస్క్ అయినా కూడా ఆయన సాహసంతో ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ప్రేక్షకుల సినిమాను చూసి సపోర్ట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిహార్ కపూర్ గారు మాట్లాడుతూ : ఈ సినిమా కోసం మేం పడిన కష్టం షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్ఎక్స్ ఇవన్నీ మీరు 70mm స్క్రీన్ మీద చూస్తేనే మీకు తెలుస్తుంది. ఈ సినిమాలో దేశభక్తి, మదర్ సెంటిమెంట్, డివోషన్, రైతుల కష్టం ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఫుల్ ఎక్స్పీరియన్స్ కచ్చితంగా ధియేటర్లోనే వస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమాగా ఈ సినిమాని 8 భాషల్లో విడుదల చేస్తున్నాం. మా ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని ఈ సినిమాని ఆదరించి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ఆర్టిస్ట్ నాగార్జున మాట్లాడుతూ : ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. మీడియాకి ఫ్రెండ్స్ కి ఈ సినిమా షో వేసి చూపించం చూసిన ప్రతి ఒక్కరు సినిమా బాగుందని మెచ్చుకున్నారు. అదేవిధంగా ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి మమ్మల్ని ఆదరించి ఈ సినిమా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

రగ్ధా ఇఫ్తాకర్ మాట్లాడుతూ : ఒక మంచి డిఫరెంట్ కథతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో మెసేజ్ ఉన్న మూవీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఒక మంచి పాజిటివ్ మెసేజ్ ఉన్న సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ చూసి ఆశీర్వదించి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

సంజన శెట్టి మాట్లాడుతూ : ఒక మంచి సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ అందరి మనసులని హత్తుకుంటుంది. అందరూ ఈ సినిమా చూసి సపోర్ట్ చేసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.

తారాగణం :
నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ , సంజన, తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్

టెక్నీషియన్స్ :
కథ : అంజిరెడ్డి శ్రీనివాస్
సంగీతం : సాబు వర్గీస్
ఎడిటింగ్ : వెలగపూడి రామారావు
డిఓపి : కంతేటి శంకర్
PRO : మధు VR
కో-డైరెక్టర్లు : కూరపాటి రామారావు, గోలి వెంకటేశ్వరులు
నిర్మాణం : చదలవాడ బ్రదర్స్
నిర్మాత : చదలవాడ పద్మావతి
స్క్రీన్ ప్లే & దర్శకత్వం : చదలవాడ శ్రీనివాసరావు
పి ఆర్ ఓ : మధు VR