జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

58

అజయ్, రవిప్రకాశ్, హర్షిణి, మాండవియా సెజల్, చమ్మక్‌ చంద్ర, చిత్రం శ్రీను ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘కేస్‌ నం. 15’. బీజీ వెంచర్స్‌ పతాకంపై స్వీయదర్శకత్వంలో తడకల వంకర్‌ రాజేశ్‌ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా తడకల వంకర్‌ రాజేశ్‌ మాట్లాడుతూ – ‘‘సస్ప
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించిన చిత్రం ఇది. బలమైన కథాశంతో తెరకెక్కించిన ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి. అజయ్‌కి మంచి పేరు వస్తుంది. రవిక్రాశ్‌ ఓ డిఫరెంట్‌ పోలీసాఫీసర్‌ పాత్ర చేశారు. ఈ చిత్రానికి జాన్‌ మంచి సంగీతం ఇచ్చారు. సినిమాలో ఉన్న ఒకే ఒక్క పాటకు మంచి స్పందన లభించింది. ఆనం వెంకట్‌గారు అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఇచ్చారు. ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చే విధంగా ఉంటుంది. నా అభివృద్ధికి అండగా నిలబడిన సి. కల్యాణ్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు.
ఈ చిత్రానికి రచన–దర్శకత్వం: రాజేశ్‌ తడకల, సంగీతం: జాన్, పాటలు: బాలకృష్ణ, కెమెరా: ఆనం వెంకట్, ఎడిటింగ్‌: ఆర్‌కె స్వామి, ఆర్ట్‌: మధు రెబ్బా

Banner – Bg ventures
Producer and Director – Tadakala vankar Rajesh
Artist-
1. Hero- Ajay
2. Ravi Prakash
3. Harshini
4. Mandavia Sejal
5. Chamak Chandra
6. Chitram seenu
7. Appa rao
8. Gaddam naveen
9. (KA Pual fame) Ramu
10. Junior Rajshekar
11. Pavitra
12. Kavita
13. Rekha

Technicians

Written and directed by- Rajesh tadakala
Cinematographer – Anam venkat
Music- John
Editor- R.k Swamy
Lyric Writer- Balakrishna
Art- Madhurebba

PRO; Mutayala Satyanarayana