`ఒక యువ‌త క‌థ‌` లోగో లాంచ్‌!!

483

ప్ర‌వీణ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సూర్య కుమారి వ‌ర్క్స్ ప‌తాకంపై శ్రీమ‌తి ఏలూరి సూర్య కుమారి నిర్మాత‌గా ఆప‌తి ప్ర‌వీణ్ కుమార్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఒక యువ‌త క‌థ‌`. షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం లోగో లాంచ్ ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత‌లు తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, ల‌య‌న్ సాయి వెంక‌ట్ చేతుల మీదుగా జ‌రిగింది.
ఈ సంద‌ర్భంగా అతిథులుగా విచ్చేసిన త‌మ్మ‌‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ, ల‌య‌న్ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ…“మ‌హిళా దినోత్స‌వం రోజున మ‌హిళా నిర్మాతగా తెర‌కెక్కుతోన్న `ఒక యువ‌త క‌థ‌` చిత్రం లోగో ఆవిష్క‌ర‌ణ మా చేతుల మీదుగా చేయ‌డం ఆనందంగా ఉంది. దాదాపు 30 మందిని కొత్త వారిని తెర‌కు ప‌రిచ‌యం చేస్తూ రూపొందుతోన్న ఈ చిత్రం విజ‌యం సాధించాల‌ని కోరుకుంటూ టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.

చిత్ర‌ నిర్మాత ఏలూరి సూర్య కుమారి మాట్లాడుతూ..“సినిమా రంగంపై ఆస‌క్తితో తొలిసారిగా నిర్మాత‌గా మారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నా. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చి కొత్త వారిని హీరో హీరోయిన్స్ గా ప‌రిచ‌యం చేస్తూ ఈ చిత్రాన్ని ప్రారంభించాము. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ పూర్తి చేశాం. మా యూనిట్ స‌హ‌కారంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుకున్న విధంగా సినిమా వ‌స్తోంది. ఈ రోజు మా సినిమా లోగో లాంచ్ కి విచ్చేసిన అతిథుల‌కు ధ‌న్య‌వాదాలు. మా తొలి ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దిస్తారని కోరుకుంటున్నా“ అన్నారు.

ద‌ర్శ‌కుడు ఆప‌తి ప్ర‌వీణ్ కుమార్ మాట్లాడుతూ…“ల‌వ్ అండ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశం ఇది. ప్ర‌స్తుత యువత న‌డ‌త ఎలా ఉంది? అనేది చూపిస్తూ అంత‌ర్లీనంగా మంచి సందేశాన్ని ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. మా నిర్మాత ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ‌తో సినిమా చాలా బాగా వ‌స్తోంది. నటీన‌టులు కొత్త‌వారైన‌ప్ప‌టికీ ఎంతో శ్ర‌ద్ధ‌తో చేస్తున్నారు“ అన్నారు.

భ‌ర‌త్ మహేశ్వ‌రం, హేమంత్ వ‌ర్మ‌, అజిత్ సింగ్‌, సిరిల్ గాలంకి, ఖుష్బు వైష్ణ‌వ్, నందిగామ పూజిత‌, ప్రియ వైష్ణ‌వ్ యం.ఎస్ నందిని , ర‌త్న‌శ్రీ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః జ‌య‌సూర్య‌; మాట‌లుః మ‌ల్లేష్ రాజు మొగుడంప‌ల్లి; కొరియోగ్ర‌ఫీః తాజుద్దీన్‌; ఫైట్స్ః హుస్సేన్ మాస్ట‌ర్; క‌థ‌-స్ర్కీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంః ఆప‌తి ప్ర‌వీణ్ కుమార్‌.