‘ఓ పిట్ట కథ’ లాంటి థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే ఇప్పటివరకు నేనెక్కడా వినలేదు, చూడలేదు – నటుడు బ్రహ్మాజీ

1047


అగ్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ పతాకంపై చెందు ముద్దుని దర్శకుడిగా పరిచయం చేస్తూ వి.ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం `ఓ పిట్ట కథ`. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు హీరోలుగా, నిత్యాశెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ పూర్త‌యి మార్చి 6న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో..

బ్రహ్మాజీ మాట్లాడుతూ, “ఓ పిట్ట కథ మార్చ్ 6న విడుదల అవుతుంది. డైరెక్టర్ చెందు ముద్దు సినిమా చాల ముద్దుగా తీశారు. మా ఓ పిట్టా కథ వెనుక ఓ చిన్న పిట్ట కథ ఉంది, ఆయన మొదట ఒక కాన్సెప్ట్ తో మా దగ్గరికి వచ్చాడు. నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ ఫ్రెండ్స్ చెందు గురించి చాల బాగా చెప్పారు. ఒక రోజు ఆ కాన్సెప్ట్ మీద ఒక షార్ట్ ఫిలిం చేద్దాం అని అడిగారు, నాకు డేట్స్ కుదరక వద్దన్నాను. తరువాత అదే కథతో ఒక డెమో ఫిలిం చూపించారు, థ్రిల్లింగ్ గా అనిపించింది అదేకదా వినలేదు చూడలేదు. అదే సమయంలో భవ్య క్రియేషన్స్ అన్నే రవి ని కలవటం, ఆనంద్ ప్రసాద్ గారికి కూడా ఇది నచ్చడం జరిగిపోయాయి.

ప్రొడ్యూసర్ ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ’ “మా సినిమా మార్చి 6న విడుదలవుతుంది. ఉత్కంఠంగా సాగే సన్నివేశాలతో, అందమైన విజువల్స్ తో మా ‘ఓ పిట్ట కథ’ మీ అందరిని అలరిస్తుంది. డైరక్టర్ చెందు ముద్దు చాలా బాగా తీశారు. నటీ నటులు, బ్రహ్మాజీ, సంజయ్, విశ్వంత్, నిత్యా చాలా బాగా చేశారు. చిత్రానికి సంబంధించిన లుక్స్ కి ప్రీ టీజర్ కి అనూహ్య స్పందన లభించడం ఆనందంగా ఉంది. వినోదం, ప్రేమ, సస్పెన్స్ తో మంచి కంటెంట్ ఉన్న చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.

డైరెక్టర్ చెందు ముద్దు మాట్లాడుతూ, “మా సినిమా కి సెన్సార్ వాళ్ళు క్లీన్ U ఇచ్చారు. ముందుగా బ్రహ్మాజీ గారికి, నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారికి, అన్నే రవి గారికి ధన్యవాదాలు. డైరెక్టర్ ఏలేటి గారు మాకు చాలా సపోర్ట్ చేసారు. మా హీరోయిన్ వెంటక లక్ష్మి పాత్ర లో నిత్యా అనుకున్న దానికంటే బాగా చేసింది. విశ్వంత్ మా సినిమాకి మంచి అసెట్. సంజయ్, నేను ఎప్పటినుండో ట్రావెల్ చేస్తున్నాం, ఆయన టాలెంట్ నాకు బాగా తెలుసు. కామెరాన్ సునీల్ కుమార్ చాల చిన్న యూనిట్ తో చాలా ఎక్కువ పని చేశారు, అనుకున్నదానికంటే బాగా వచ్చాయి విజువల్స్. మా పిట్టా కథ మీ అందరికి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను, మర్చి 6 న థియేటర్లలో కలుద్దాం.