HomeTeluguమార్చి 24న ఓ భామ అయ్యో రామ’ టీజర్‌ విడుదల.. బ్యూటిఫుల్‌ పోస్టర్‌తో అనౌన్స్‌ చేసిన...

మార్చి 24న ఓ భామ అయ్యో రామ’ టీజర్‌ విడుదల.. బ్యూటిఫుల్‌ పోస్టర్‌తో అనౌన్స్‌ చేసిన మేకర్స్‌

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ కథానాయకుడు సుహాస్ , మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తూ అందరిని అలరించడానికి సిద్ధమయ్యాడు హీరో సుహాస్‌ ‘ఓ భామ అయ్యో రామ’ అనే ఈ ప్రేమకథలో మలయాళ నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమాను రామ్ గోధల తన తొలి ప్రయత్నంగా దర్శకత్వం చేస్తున్నారు,వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. కాగా ఈ చిత్రం టీజర్‌ మార్చి 24న ఉదయం 11 గంటల 7నిమిషాలకు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్‌. దీనికి సంబంధించిన ఓ బ్యూటిఫుల్‌ పోస్టర్‌తో టీజర్‌ అనౌన్స్‌ చేశారు నిర్మాతలు. ఈ బ్యూటిఫుల్‌ పోస్టర్‌ నెటిజన్లు ఆకట్టుకుంటోంది.

నిర్మాత మాట్లాడుతూ ” సుహాస్‌ కెరీర్‌కు మైలురాయిగా నిలిచే చిత్రంగా ఇది ఉంటుంది. రాబోయే టీజర్‌ ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతుంది. ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఓ బెస్ట్‌ క్వాలిటీ సినిమాను అందించబోతున్నాం. ఈ చిత్రంలో సున్నితమైన ప్రేమ భావోద్వేగాలతో పాటు అంతకు మించిన ఫన్‌ ఉంటుంది. ఈ చిత్రంలోని వినోదం ఆడియన్స్‌ను ఎంతో ఎంటర్‌టైన్‌ చేస్తుందనే నమ్మకం వుంది. ఈ వేసవిలో ఓ భామ అయ్యో రామ బెస్ట్‌ ఎంటర్ టైనర్‌ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

సీనియర్ నటి అనితా హసనందిని మరియు ప్రముఖ నటుడు అలి కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక బృందం పనిచేస్తోంది – మనికందన్ సినిమాటోగ్రఫీ చేయగా, రధన్ సంగీతాన్ని అందిస్తున్నారు. భవిన్ షా ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్‌ను సమకూరుస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం 2025 వేసవి లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు:
సుహాస్, మాళవిక మనోజ్, అనితా హసనందిని, అలి, బబ్లూ పృథ్వీ రాజ్, రవీందర్ విజయ్, మొయిన్

సాంకేతిక నిపుణులు:
రచయిత-దర్శకుడు: రామ్ గోధల
నిర్మాత: హరీష్ నల్ల
బ్యానర్: V ఆర్ట్స్
సంగీతం: రధన్
సినిమాటోగ్రఫీ: మనికందన్ S
ఎడిటింగ్: భవిన్ షా
ప్రొడక్షన్ డిజైన్: బ్రహ్మ కడలి
కాస్ట్యూమ్స్: అశ్వంత్ & ప్రతిభ
PRO: ఏలూరు శ్రీను – మడూరి మధు

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES