బహుముఖ ప్రతిభాశాలి శ్రీకాంత్ గాదిరాజు దర్శకత్వంలో… నిత్యా క్రియేషన్స్ పతాకంపై ఎ. బ్రహ్మయ్య-జి.విశాల్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ “క్యూ”. తోషి అనే నవ యువకుడు హీరోగా పరిచయమవుతున్న ఈ విభిన్న కథాచిత్రంలో సీనియర్ నటుడు దిల్ రమేష్ ఓ కీలకపాత్ర పోషిస్తుండగా… గంగారామ్, శ్రీనివాస్, అజయ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అందాల భామ అశ్విని హీరోయిన్.
ఆహారంలో జరిగే కల్తీ నేపథ్యంలో… ప్రజలు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తల గురించి హెచ్చరిస్తూ… రవ్వంత సందేశానికి కొండంత వినోదాన్ని జోడించి రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి… ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న దిల్ రమేష్ క్లాప్ కొట్టగా… నిర్మాతల్లో ఒకరైన బ్రహ్మయ్య కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ చిత్రం స్టంట్ మాస్టర్ దేవరాజ్ ఫస్ట్ షాట్ కు డైరెక్షన్ చేశారు. రియల్ లైఫ్ పోలీస్ ఆఫీసర్ గంగారామ్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుండడం గమనార్హం.
తెలుగు తెరపై ఇప్పటివరకు స్పృశించని అత్యంత వినూత్నమైన కథాంశంతో రూపొందుతున్న “క్యూ” చిత్రానికి పని చేస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ మంచి పేరు తెస్తుందని దర్శకుడు శ్రీకాంత్ గాదిరాజు తెలిపారు. తమ దర్శకుడు శ్రీకాంత్ గాదిరాజు చెప్పిన కథ తమకు విపరీతంగా నచ్చి, తనపై నమ్మకంతో ఈ చిత్రానికి శ్రీకారం చుట్టామని నిర్మాతలు బ్రహ్మయ్య-విశాల్ రావు పేర్కొన్నారు. ఈ చిత్ర రూపకల్పనలో అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తున్న విక్కీ మాస్టర్ కి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. “క్యూ” చిత్రం చూసేందుకు ప్రేక్షకులు కచ్చితంగా క్యూ కడతారనే నమ్మకం ఉందని, ఇంత మంచి చిత్రంతో హీరోగా పరిచయమవుతుండడం గర్వంగా ఉందని అన్నారు చిత్ర కథానాయకుడు తోషి.
ప్రారంభం కావడంతోనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, మేకప్: రామకృష్ణ, స్టిల్స్: పంతులు, స్టంట్స్: దేవరాజ్, కెమెరా: పి.ఎన్. అర్జున్, పోస్ట్ ప్రొడక్షన్: వ్యాస స్టూడియోస్, డైరెక్షన్ టీమ్: దీక్షిత్, ప్రజ్వల్, వర్మ, యశ్వంత్, నాయుడు, శివ, రాము, నిర్మాతలు: ఎ. బ్రహ్మయ్య-జి.విశాల్ రావు, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీకాంత్ గాదిరాజు!!