డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా ‘నిన్నే పెళ్లాడతా’ టీజర్ విడుదల

428

అమన్ (రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు), సిద్ధికా శర్మ హీరోహీరోయిన్లుగా అంబికా ఆర్ట్స్, ఈశ్వరీ ఆర్ట్స్ పతాకాలపై వైకుంఠ్ బోను దర్శకత్వంలో రమ్య రాజశేఖర్, శ్రీధర్ బాబు నిర్మించిన చిత్రం ‘నిన్నేపెళ్లాడతా’. అక్టోబర్ సెకండ్ వీక్‌లో విడుదల కానున్న ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది.

టీజర్ విడుదల అనంతరం డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ‘‘ నిన్నేపెళ్లాడతా.. ఆల్రెడీ అందరికీ తెలిసిన టైటిల్ ఇది. ఈ టైటిల్‌తో కొత్త కథతో వస్తున్న టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి టీమ్ అందరికీ మంచి గుర్తింపును తీసుకురావాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.

చిత్ర నిర్మాత శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘‘మా చిత్ర టీజర్‌ని విడుదల చేసిన దర్శకులు శ్రీకాంత్ అడ్డాల గారికి మా టీమ్ తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాము..’’ అని అన్నారు.

చిత్ర దర్శకుడు వైకుంఠ్ బోను మాట్లాడుతూ.. ‘‘ నిన్నేపెళ్లాడతా.. టీజర్‌ను విడుదల చేసి.. మా టీమ్‌ని ఆశీర్వదించిన శ్రీకాంత్ అడ్డాల గారికి ధన్యవాదాలు. చిత్రాన్ని అక్టోబర్ సెకండ్ వీక్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల గారు టీజర్ విడుదల చేశారు. నెక్ట్స్ వీక్ మరో గెస్ట్‌తో రొమాంటిక్ సాంగ్‌ని విడుదల చేయనున్నాం. విడుదలలోపు మ్యాగ్జిమమ్ ప్రమోషన్స్ ప్లాన్ చేశాం.
మరో నిర్మాత రమ్య రాజశేఖర్ మాట్లాడుతూ”స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గారి సోదరుడు అమన్ ఇందులో హీరోగా చేశారు. సిద్ధికా శర్మ హీరోయిన్. సాయికుమార్‌గారు, ఇంద్రజగారు, అన్నపూర్ణమ్మగారు.. ఇలా సీనియర్ నటీనటులెందరో ఈ చిత్రంలో నటించారు. సినిమా అంతా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాము. సహకరించిన అందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.

అమన్ , సిద్ధికా శర్మ, సాయికుమార్, ఇంద్రజ, సీత, సిజ్జు, అన్నపూర్ణమ్మ, విద్యుల్లేఖ రామన్, మధునందన్, సాయికిరణ్, గగన్ విహారి తదితరులు నటించిన ఈ చిత్రానికి

బ్యానర్స్: అంబికా ఆర్ట్స్, ఈశ్వరీ ఆర్ట్స్
సంగీతం: నవనీత్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ ఈదర,సురేష్ గొంట్ల
ఫైట్స్: రామకృష్ణ
లిరిక్స్: భాస్కరభట్ల, చైతన్య ప్రసాద్, రాంబాబు గిడాల, రామ్ పైడిశెట్టి
కో ప్రొడ్యూసర్:సాయికిరణ్ కొనేరి
పీఆర్వో: బి. వీరబాబు
నిర్మాతలు:రమ్య రాజశేఖర్, వెలుగోడు శ్రీధర్ బాబు
రచన-దర్శకత్వం: వైకుంఠ్ బోను