ఓటిటి రంగంలో సరికొత్త వినోద విప్లవం ఆవిష్కరించేందుకు సమాయత్తమైన “సన్ షైన్ ఓటిటి యాప్”.ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడిక ప్రపంచంలో ఎక్కడి నుంచైనా.. ఎవరైనా డౌన్ లోడ్ చేసుకుని అపరిమితమైన వినోదాన్ని ఆస్వాదించవచ్చు.ఈ ఓటిటి యాప్ లాంచ్ వేడుక హైదరాబాద్ లోని దస్ పల్లా హోటల్ లో ఘనంగా జరిగింది.ఈ ఓటిటి లాంచ్ వేడుకకు
ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రభాకర్,యువ హీరో రాం కార్తిక్ ల ముఖ్య అతిధులుగా వచ్చి సన్ షైన్ ఓటిటి ను లాంచ్ చేయడం జరిగింది. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో
ఓటిటి వ్యవస్థాపకుడు శివప్రసాద్ మాట్లాడుతూ..మా సన్ షైన్ ఓటిటి ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది.ఈ ఓటిటి లో సినిమా కంటెంట్ మాత్రమే కాకుండా వెబ్ సిరీస్, గేమ్స్, స్పోర్ట్స్,లైవ్ న్యూస్, కిడ్స్ కంటెంట్, ఈవెంట్స్, లైవ్ ఈవెంట్స్ ఇలా అనేకమైన కంటెంటెంట్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్మెంట్స్ చేయడం జరుగుతుంది.ఇంకా భవిష్యత్ లో టెక్నాలజీ కు అనుగుణంగా తీర్చి దిద్ది మెరుగైన సేవలు అందించడం జరుగుతుంది
కన్నడ దర్శకుడు ప్రభాకర్ మాట్లాడుతూ..డిజిటల్ టెక్నాలజీ తో ఎవరైతే నడుస్తారో వారు సక్సెస్ అయినట్లే తన చేతుల మీదుగా ఆవిష్కారమైన “సన్ షైన్ ఓటిటి” అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఆకాక్షించారు
హీరో రాం కార్తిక్ మాట్లాడుతూ .. ఇప్పటికే మార్కెట్ లో చాలా ఓటిటి లు వచ్చాయి. ఎన్ని ఓటిటిలు వచ్చినా కంటెంట్ ఉన్న ఓటిటి లకు ప్రేక్షకాదరణ లభిస్తుందనే విషయాన్ని ప్రేక్షకులు నిరూపించారు. అలాగే ఇప్పుడు మంచి కంటెంట్ తో వచ్చిన “సన్ షైన్” ఓటిటి ని కూడా ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ ఓటిటి ని నాతో లాంచ్ చేయించినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న ఈ సన్ షైన్ ఓటిటి గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుతూ సన్ షైన్ ఓటిటి అధినేత శివప్రసాద్ గారికి కి మరియు ఓటిటి ని సక్సెస్ చేయడానికి కృషి చేసిన టీం అందరికీ అల్ ద బెస్ట్ అని అన్నారు.