మాళవిక శర్మ అందం అభినయానికి అభిమానులు ఎక్కువే !!!

1148

‘నేల టిక్కెట్’ మూవీలో మాస్ మహరాజ్ రవితేజతో ఆడిపాడింది హీరోయిన్ మాళవిక శర్మ. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయిన ఈ అమ్మాయి నటనకు మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు ఇస్మార్ట్ హీరో రామ్ నెక్ట్స మూవీ ‘రెడ్‌’లో నటిస్తోంది. రెడ్ సినిమా తనకు తప్పకుండా మంచి గుర్తింపును తెచ్చిపెడుతోందని మాళవిక హోప్స్ పెట్టుకుంది.

ఈమెకు సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ ఉంది. ఇప్పటికే రిలీజైనా రెడ్ మూవీ ‘నువ్వే నువ్వే’ సాంగ్‌లో అందంగా కనిపించి అందరి దృష్టిలో పడింది. సోషల్ మీడియాలో మాళవికకు మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో తనకు బాగా ఫాలోయర్స్ ఉన్నారు. ఈ అమ్మడు పెట్టిన ఫొటోలకు లైక్స్, కామెంట్స్ లిస్ట్ పెద్దదే. తన ట్యాలెంట్, బ్యూటీ తో మాళవిక ఇదంతా సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు.

మాళవిక శర్మ ప్రస్తుతం రామ్ హీరో గా నటించిన “రెడ్ “సినిమా లో నటిస్తుంది. ఏప్రిల్ 9 న రిలీజ్ కానున్న ఆ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. మంచి పాత్రలు, అలరించే కథల ఎంపికలో ఉన్న మాళవిక త్వరలో వాటి వివరాలు తానే స్వయంగా ప్రకటించనున్నారు. అందంతో పాటు అభినయం ఉన్న ఈ అమ్మడికి అభిమానులు కూడా ఎక్కువే.