డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న “నీతో” ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లలో ఈ నెల 14 న “నీతో”..

331


పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై అభిరామ్ వర్మ , సాత్వికా రాజ్ హీరో హీరోయిన్లుగా బాలు శర్మ దర్శకత్వంలో ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ జంజాల సంయుక్తంగా కలసి యూత్ ఆడియన్స్ మెచ్చే డిఫరెంట్ కంటెంట్ తో నిర్మించిన చిత్రం “నీతో”. వివేక్ సాగర్ సంగీతం సమాకూర్చారు.ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు, ట్రైలర్, టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 14 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్రం యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన నిర్మాత రాజ్ కందుకూరి, హీరో శివ కందుకూరి, నటుడు శివ, ఐ.ఏ.ఎస్ సురేష్ బాబులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా

గెస్ట్ గా వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. బాలు శర్మ నేను చేసిన పెళ్లి చూపులు సినిమాకు వర్క్ చేశాడు. అప్పటి నుండి పరిచయం.తను రాసుకునే కథలు బాగుంటాయి. తరుణ్ భాస్కర్ దగ్గర వర్క్ చేయడంతో ఆ ఫ్లేవర్ తనలో ఉంటుంది. ప్రస్తుత ప్రేక్షకులు చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడరు కంటెంట్ ఉన్న ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సినిమాలో కూడా మంచి పాయింట్ ఉన్నట్టు టీజర్ ట్రైలర్, చూస్తే తెలుస్తుంది.పాటలు చాలా బాగున్నాయి. హీరో, హీరోయిన్ లు చాలా బాగా నటించారు.ఈ సినిమాకు మంచి టెక్నిషియన్స్ వర్క్ చేశారు. “నీతో” వంటి మంచి కథను సెలెక్ట్ చేసుకొని ఇండస్ట్రీ కి కొత్తవారిని పరిచయం చేస్తున్న నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

గెస్ట్ గా వచ్చిన హీరో శివ కందుకూరి మాట్లాడుతూ… “నీతో” మూవీ సింపుల్ గా చాలా బాగా తీశారు.. అభిరామ్ నాకు చాలా కాలంగా తెలిసు.తను మంచి యాక్టర్. బాలుశర్మ గారు ఈ సినిమాను చాలా బాగా తీశాడు. ఖర్చుకు వెనుకడకుండా నిర్మించిన ఈ సినిమా నిర్మాతలను బ్లెస్స్ చేస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఈ నెల 14 న వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

గెస్ట్ గా వచ్చిన నటుడు శివ మాట్లాడుతూ.. ఈ చిత్ర నిర్మాతలు డిఫరెంట్ కాన్సెప్ట్ కథలు సినిమాలు తీస్తారు. టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. ఈ నెల 14 న వస్తున్న “నీతో” సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

చిత్ర నిర్మాత స్నేహాల్ మాట్లాడుతూ…ఇదొక ఫ్రెస్ లవ్ స్టోరీ. ఆనంద్ లాంటి మంచి లవ్ స్టోరీ ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. వివేక్ సాగర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు, చిత్ర యూనిట్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. ఈ నెల 14 న వస్తున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. అందరూ అదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

మరో నిర్మాత ఏవీఆర్ స్వామి మాట్లాడుతూ..డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకు నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ డెడికేటెడ్ గా వర్క్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. మేము తీసిన కథను నమ్మి సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చిన పి.వి.ఆర్ ఉదయ్ గారికి ధన్యవాదములు. ఈ నెల 14 న వస్తున్న “నీతో” సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర దర్శకుడు బాలు శర్మ మాట్లాడుతూ.. నేను చెప్పిన కథను నమ్మి సినిమా చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాతలు ధన్యవాదాలు. యూత్ ఆడియన్స్ మెచ్చే డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన ట్రైలర్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.. “మనకు రిలేషన్ షిప్ ఎలా ఎండ్ అయిందో గుర్తుంటుంది కానీ, ఎలా స్టార్ట్ అవుతుందో గుర్తురాదు”లాంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ట్రైలర్ మొదటి నుండి చివరి వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ సినిమాకు వివేక్ సాగర్ అద్భుతమైన స్వరాలు సమకూర్చగా, సుందర్ రామ కృష్ణ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది.ఉన్నత నిర్మాణ విలువ లతో తెరకెక్కిన ‘నీతో’ ఈ నెల 14న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

చిత్ర హీరో అభిరామ్ వర్మ మాట్లాడుతూ..ఇంతముందు నేను చేసిన సినిమాల ద్వారా లవ్ స్టోరీ లకు పనికిరాడు అనడంతో మంచి లవ్ స్టోరీ తియ్యాలనే కసి పెరిగింది. దాంతో ఇప్పుడు వస్తున్న సినిమాలకు భిన్నంగా ఉండే మంచి లవ్ సబ్జెక్టు ను దర్శకుడు బాలుశర్మ గారు చెప్పడంతో కచ్చితంగా ఈ సినిమా చెయ్యాలనుకున్నాను. బాలు గారు ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు నిర్మాతల సపోర్ట్ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. మంచి కాన్సెప్ట్ తో ఈ నెల 14 న వస్తున్న “నీతో” సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

చిత్ర హీరోయిన్ సాత్వికా రాజ్ మాట్లాడుతూ..చాలా లవ్ స్టోరీ లు ఉన్నాయ్, కానీ ఇప్పుడు ఒక ఫ్రెష్ అండ్ న్యూ  లవ్ స్టోరీ  రావాలంటే కష్టం,  సో ఈ కథను విన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అందుకే చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాము. అభిరామ్ మంచి సపోర్టివ్ యాక్టర్, కొన్ని సీన్స్ తీసినప్పుడు కానీ, షాట్స్ లో రియాక్షన్స్ లో డైలాగ్స్ విషయం లో తనతో పాటు యూనిట్ అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. ఈ నెల 14 న వస్తున్న ఈ సినిమా మాకు మంచి పేరు తెస్తుందని అశిస్తున్నాను అన్నారు.

పి.వి.ఆర్ ఉదయ్ మాట్లాడుతూ.. ఫ్యామిలీ తో కలసి చూసే విధంగా దర్శక, నిర్మాతలు “నీతో” సినిమాను చాలా బాగా తీశారు. అందుకే నేను ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చాను అన్నారు.

ఐ.ఏ.ఎస్ సురేష్ బాబు మాట్లాడుతూ.. టీం అందరూ కలసి వినూత్న మైన న కథాంశం తో తెరకెక్కిన ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

నటీనటులు:
అభిరామ్ వర్మ, సాత్విక రాజ్, రవివర్మ, నేహా కృష్ణ, కావ్య రామన్, అపూర్వ శ్రీనివాసన్, మోహిత్ బైద్, పవిత్రా లోకేష్, పద్మజా ఎల్, గురురాజ్ మానేపల్లి, సంజయ్ రాయచూర, లేట్. Tnr (తుమ్మల నరసింహా రెడ్డి), స్నేహల్ జంగాల, AV R స్వామి, C S ప్రకాష్, సందీప్ విజయవర్ధన్, కృష్ణ మోహన్, రాజీవ్ కనకాల తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రి
నిర్మాత : ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : బాలు శర్మ
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: సుందర్ రామ్ కృష్ణన్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
కాస్ట్యూమ్ డిజైన్: సంజన శ్రీనివాస్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: స్మరన్
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ, వరుణ్ వంశీ. బి, శ్రీనివాస మౌళి
ప్లే బ్యాక్ సింగర్స్: హరి హరన్, గౌతం భరద్వాజ్, వివేక్ సాగర్, అదితి భవరాజు, మనీషా ఈరబతిని, లిప్సికా భాష్యం
దర్శకత్వ బృందం: శ్రీధర్ చుక్కల, శివ కిరణ్, శ్యామ్ బంధువుల, సయ్యద్ షకీర్, అనిల్ కుమార్ ఎల్లిగారి, అభిలాష్ సిర్రా
సినిమాటోగ్రఫీ బృందం: లెవిన్ అల్ఫోన్స్, యోగేష్ ఎం, గురునాథ్ వి ఎస్

PRO; ELURU SEENU,SHYAM