త్వరలో “నవ రాగరస” – షో రీల్ ను విడుదల చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

20


ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భం…ఒకరోజు ముందస్తుగా సంగీత ప్రియులకు శుభవార్త అందించారు ప్రముఖ వేణు గాన విద్వాంసులు, సంగీత దర్శకుడు తాళ్లూరి నాగరాజు! సెవెన్ నోట్స్ మీడియా సంస్థ ఆధ్వర్యం లో నవ రాగరస అనే టివి ప్రోగ్రామ్ షో రీల్ ను సోమవారం ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు లాంఛనం గా విడుదల చేశారు. అలాగే సెవెన్ నోట్స్ యు ట్యూబ్ ఛానెల్ ను కూడా ఆయన ఆవిష్కరించి అభినందించారు.

తాళ్లూరి నాగరాజు సంగీత దర్శకత్వం వహిస్తున్న నవ రాగరస కార్యక్రమం త్వరలో ఈటివి లో ప్రతి ఆదివారం ప్రసారం కానున్నది. ఈ కార్యక్రమానికి రూపకర్త ప్రముఖ సినీ నేపధ్య గాయని మణి నాగరాజు. మురళీధర్ కేసరి ప్రోగ్రామ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పేరొందిన గాయకులు, సంగీతజ్ఞులు పాల్గొనే ఈ కార్యక్రమం శాస్త్రీయ, ఆధునిక సంగీతాల సమ్మేళనం అని, సంగీత ప్రియులకు వీనుల విందు చేస్తుందని సంగీత దర్శకుడు తాళ్లూరి నాగరాజు తెలిపారు. మరో మంచి సంగీత కార్యక్రమం అందిస్తున్న నాగరాజు దంపతులకు అభినందనలు🌹

డా. మహ్మద్ రఫీ