సుప్రీమ్ మూవీస్ అధినేత `రాజు హర్వాణి` సమర్పణలో చక్ర ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై వెంకటరత్నం నిర్మాతగా, జివికే కథ- స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నూతన చిత్రం `నారి నారి నడుమ మురారి`. సీనియర్ నటి ఆమని మేన కోడలు హృతిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంతో అభిలాష్ బండారి హీరోగా పరిచయమవుతున్నారు. ప్రముఖ హీరోయిన్ అతిథి పాత్రలో నటిస్తోంది. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్ను ఏప్రిల్ 25న విడుదల చేశారు. ఆహ్లాదకరంగా ఉన్న ఈ టైటిల్పోస్టర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
వినూత్నమైన కథ కథనాలతో ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా క్రిస్పీ స్క్రీన్ ప్లేతో ఈ చిత్రం రూపొందుతుందని దర్శకుడు జీవికే తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “ప్రస్తుతం నారి నారి నడుమ మురారి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. పాటలు చాలా బాగా వచ్చాయి. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి జులై, ఆగస్ట్ నెలల్లో యానం, అమలాపురం, వైజాగ్, లంబసింగి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అందమైన లోకెషన్స్లో చిత్రీకరణ జరుపనున్నాం. జె. ప్రభాకర్ రెడ్డి గారు డిఓపిగా వ్యవహరిస్తుండగా సింధు కే ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండేలా మంచి స్క్రిప్ట్ కుదిరింది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది“ అన్నారు.
తారాగణం:
అభిలాష్ బండారి, హృతిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి
సాంకేతిక వర్గం:
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జివికే(GVK)
సమర్పణ: రాజు హర్వాణి (సుప్రీమ్ మూవీస్)
బ్యానర్: చక్ర ఇన్ఫోటైన్మెంట్
నిర్మాత: వెంకటరత్నం
సినిమాటోగ్రఫి: జె. ప్రభాకర్ రెడ్డి
సంగీతం: సింధు కే ప్రసాద్
ఆర్ట్: షెరా
ఎడిటింగ్: సత్య గిదుటూరి
ఫైట్స్: `వింగ్ చున్` అంజి
ప్రొడక్షన్ కంట్రోలర్ : ఎంకే బాబు
పోస్టర్ డిజైనర్ : పార్ధు క్రియేషన్స్