నా..ని ప్రేమ‌క‌థ నుండి `అందాలు చిందిస్తుంది` సాంగ్ రిలీజ్‌..

705

పీఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై పోత్న‌క్‌(శ్ర‌వ‌ణ్ కుమార్‌) నిర్మాత‌గా అముద శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్న చిత్రం నా..ని ప్రేమ‌క‌థ‌. ఈ చిత్రం నుండి అందాలు చిందిస్తుంది పాట‌ను ఈ రోజు సంస్థ కార్యాల‌యంలో విడుద‌ల‌చేశారు. ఒక ఊరిలో జ‌రిగిన య‌ధార్ధ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించామ‌ని నిర్మాత శ్ర‌వ‌ణ్ కుమార్ తెలిపారు.

హీరో మ‌రియు ద‌ర్శ‌కుడు అముద శ్రీ‌నివాస్ మాట్లాడుతూ – “ ఈ చిత్రంలో హీరోగా చేయ‌డంతో పాటు క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వ భాధ్య‌త‌లు కూడా నిర్వ‌హించ‌డం జ‌రిగింది.“ అన్నారు సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల‌చేస్తాం అని ఎగ్జిక్యూటివ్ గుర్ర‌పు విజ‌య్ కుమార్ తెలిపారు

ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి ఎం.ఎస్ కిర‌ణ్ కుమార్‌, ఎడిటింగ్: నంద‌మూరి హ‌రి, సంగీతం ఎం.ఎల్‌.పి రాజా, రీ రికార్డింగ్‌: చిన్నా