‘నమస్తే నేస్తమా` 80పర్సెంట్ ఆక్యుపెన్సీ – దర్శక నిర్మాత కె.సి బొకాడియా.

549

యానిమల్స్ మెయిన్ క్యారెక్టర్ లో రూపొందిన చిత్రాల‌న్నిసూపర్ హిట్స్ సాధించాయి. ఒక డాగ్ ప్రధాన పాత్రలో జాకీ ష్రాఫ్ హీరోగా కె. సి బొకాడియా అందించిన ‘తేరి మెహెర్బానియా’ గోల్డెన్ జూబ్లీ హిట్ అయింది. ఆ చిత్రం ఇన్స్పిరేషన్ తో ‘తేరి మెహెర్బానియా’ పార్ట్ 2గా కె. సి బొకాడియా దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘నమస్తే నేస్తమా’. జనవరి 3న గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..
దర్శక నిర్మాత కె. సి బొకాడియా మాట్లాడుతూ – “ఈ రోజు విడుదలైన మా ‘నమస్తే నేస్తమా’ చిత్రం ఆర్టిసి క్రాస్ రోడ్ లో 80పర్సెంట్ ఆక్యుపెన్సీ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. గతంలో యానిమల్స్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రాల‌న్నిసూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఆ కోవలోనే `నమేస్తే నేస్తమా` చిత్రం నిలవబోతుంది. మా సినిమాలో పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా ఇంతబాగా రిసీవ్ చేసుకున్న తెలుగు ప్రేక్షకులకు హృదయ పూర్వక ధన్యవాదాలు. తెలుగు రాష్ట్రాల ప్రజలు యానిమల్ మూవీస్ అని చాలా బాగా ఆదరిస్తారు. ఈ సినిమాని కూడా తప్పకుండా ఆదరిస్తారు అని నాకు సపోర్ట్ చేసిన బ్రహ్మానందం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ చిత్రం షూటింగ్ లో నాకు పూర్తి సహకారం అందించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు థాంక్స్. రెండు కుక్కలతో సినిమా చేయడం చాలా కష్టం. అయినా దాదాపు 100 రోజులు ఆ డాగ్స్ తో షూటింగ్ చేశాం. రెండు కుక్కలు అద్భుతంగా పెర్ఫామ్ చేశాయి. అలాగే నాజర్‌, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, చమక్‌ చంద్ర క్యారెక్టర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.