–ఈ నెల 9వ తేదీన విడుదలకు సిద్దం..
–ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్
–సమాజం గుర్తించని కరోనా వారియర్సే కథాంశం..
–పాల్గొన్న ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మహాంకాళీ దివాకర్..
వాస్తవిక స్థితిగతులే కథాంశంగా సినిమా రూపొందించడం దర్శకుడికి సాహాసమే అయినప్పటికీ ప్రయత్నంలో లభించే సంతృప్తి మరెక్కడా దొరకదని సినీ హీరో యువ దర్శకుడు తల్లాడ సాయిక్రిష్ణ తెలిపారు. కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా కిరాణాషాపు యజమానులు కూడా విశేష సేవలందించారు, కానీ సమాజం వారిని గుర్తించలేకపోయింది. ఒక కిరాణా షాపు వ్యక్తి నేపథ్యంలో ‘‘నమస్తే సేట్‌జీ’’ అనే సినిమాను నిర్మించామని ఆ సినిమా హీరో, దర్శకులు తల్లాడ సాయిక్రిష్ణ తెలిపారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మించిన నమస్తే సేట్ జీ సినిమా ఈ నెల ఏవ తేదీన విడుదల కానుంది. ఇందులో తల్లాడ సాయిక్రిష్ణ, స్వప్నా చైదరి అమ్మినేని ముఖ్యతారాగణంగా నటించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా మంగళవారం నమస్తే సేట్ జీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్య్రమానికి ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మహాంకాళీ దివాకర్‌లు ముఖ్య అతిథులుగా హాజరై వీడియో సాంగ్, ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హీరో తల్లాడ సాయిక్రిష్ణ మాట్లాడుతూ కరోనా సమయంలో తనను కలచి వేసిన నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో తీసానని, కరోనా ఆంక్షలున్న సమయంలో మారుమూల గ్రామాల్లో కిరాణా షాపు యజమానులు అందిచిన సహాకారం ఎనలేనిదని అన్నారు. ఈ సినిమాలో మాట్లాడే కెరెరా అనే కనిపించని క్యారెక్టర్ ఉందని, సినిమా చూసి ఆ కెమెరా పేరును తెలిపిన మొదటి పది మందికి ఒక్కొక్కరికీ పది వేల విలువ చేసే బహుమతులు అందించనున్నామని అన్నారు. గతంలో స్వీయ దర్శకత్వంలో ఎందరో మహానుభావులు, బ్లాక్‌బోర్డ్ అనే సినిమాలను తీసిన సినిమాలకు మంచి ఆదరణ అభించిందిన, ఈ సారి సందేశాత్మక చిత్రంగా నమస్తే సేట్‌జీ రూపొందించానని అన్నారు. తన ప్రయాణంలో వెంటుండి ప్రోత్సాహాన్ని అందిస్తున్న తనికెళ్ల భరని, తుమ్మలపల్లి రామసత్యనారాయణలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు ఊహించని స్పందన లభించిందని, అప్‌కమింగ్ సినిమా ఆర్టిస్టులకు ఇంతటి ప్రేక్షకాదరణ లభించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
నమస్తే సేట్ జీ హీరోయిన్ స్వప్నా చౌదరి అమ్మినేని మాట్లాడుతూ., సహాజత్వంతో కూడిన వినూత్న కథాంశంతో ఈ సినిమా నిర్మాణం జరిగిందని, మంచి సామాజిక విలువలతో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. హైదరాబాద్‌తో పాటు అందమైన పల్లే జీవన విధానాన్ని ఈ సినిమా ప్రతిబింభింస్తుందని ఆమె తెలిపింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ గుర్తింపు తెచ్చుకున్న తనకు ఈ సినిమా భవిష్యత్‌కు నాందిగా మారుతుందని పేర్కొన్నారు.
సినిమా ప్రొడ్యూసర్ తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ., ఈ మధ్య కుటుంబ సమేతంగా చూసే సినిమాలు రావట్లేదని, తమ నమస్తే సేట్ జీ ఇంటిల్లిపాదీ మళ్ళి చూడవచ్చని అన్నారు. ప్రతీ కిరాణా షాపు వ్యక్తి ఈ సినిమా తప్పక చూడాలని, ఈ సినిమా విజయాన్ని వారి సేవలకే అంకితం చేస్తున్నామని అన్నారు.
ప్రముఖ నిర్మాత తుమ్మల పల్లి రామసత్యనారాయణ మాటాడుతూ., తల్లాడ సాయిక్రిష్ణ క్రియేటివిటీని తన మొదటి సినిమా నుంచి చూస్తున్నానని, క్రమశిక్షణతో సినిమాలు తీయడం తన ప్రత్యేకతని అన్నారు. నిర్మాతల అనవసరపు ఖర్చులు లేకుండా, సినిమాను తక్కువ సమయంలోనే మంచి సినిమాటిక్ విలువలతో రూపొందించగలడని అభినందించారు. అతిత్వరలో తన దర్శకత్వంలో ఒక పెద్ద సినిమా నిర్మించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీటెక్ చదవి, మంచి ఉద్యోగాన్ని సైతం వదిలి సినిమా పైన ప్రేమతో దర్శకత్వమే కాకుండా 24 క్రాఫ్ట్‌లపైన పట్టు సాధించాడని, సినిమా రంగంలో ఇన్ని నైపుణ్యాలు ఉండటం చాలా అరుదని అన్నారు.
ఈ సినిమా కి నటి నటులు – తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, శోభన్ భోగరాజు, కథ -శివ కాకు, రమేష్ కుమార్ వెలుపుకొండ, సంగీతం – వి.ఆర్.ఏ ప్రదీప్, రామ్ తవ్వ , లిరిక్స్- చింతల శ్రీనివాస్, ల తో పాటు
ఈ కార్యక్రమంలో సినిమా బృందంతో పాటు ప్రముఖ సినీ నటులు కిషోర్ దాస్, లిరిసిస్ట్, రిటైర్డ్ ఐఏఎస్ చింతల శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ తవ్వ, వీబీజీ రాజు, వీ3 ఛానెల్ వ్యవస్థాపకులు కాసం సత్యనారాయణ, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
PRO–
Pavan Kumar
9849128215